అనుష్క తెగ ఫీలౌతోంది

క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ అనుష్క‌. ఆమెపై రూ.50 కోట్లు పెట్ట‌డానికి కూడా నిర్మాత‌లు రెడీ అంటున్నారు. దానికి తోడు అనుష్క సినిమా అంటే క్రేజ్ అంతా ఇంతా ఉండ‌డం లేదు. త‌మిళంలోనూ ఆమె సినిమాల‌కు మంచి గిరాకీ ఉంది. కానీ ఏం లాభం?? అనుష్క‌తో భారీ పెట్టుబడి పెట్టి సినిమా తీసిన‌వాళ్లంతా.. పాప‌ర్ అయిపోతున్నారు. రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరోకి భారీ న‌ష్టాలొచ్చాయి. అంత‌కు ముందు వ‌ర్ణ సినిమా కూడా అట్ట‌ర్ ఫ్లాపే. అందుకే అనుష్క తెగ బాధ‌ప‌డిపోతోంద‌ట‌. ఎక్క‌డ త‌న‌పై ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డిపోతుందో అని త‌న హైరానా. వ‌సూళ్లూ, విజ‌యాలూ ప‌ట్టించుకోవొద్ద‌ని, తాను పాత్ర కోసం ప‌డిన క‌ష్టాన్ని చూడ‌మంటోంది జేజ‌మ్మ‌.

”నా ప్ర‌తి సినిమా ఆడాల‌నే ఉంటుంది. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డుతుంటా. వ‌ర్ణ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డానో నాకు తెలుసు. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డం నిరుత్సాహాన్ని క‌లిగించింది. రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరోలు కూడా చాలా ప్రేమ‌తో చేసిన సినిమాలు. రుద్ర‌మదేవి కోసం చాలా సినిమాల్ని ప‌క్క‌న పెట్టా. సైజ్ జీరో కోసం బ‌రువు పెరిగా. నా క‌ష్టాన్ని గుర్తించండి.. ఆ సినిమాలు సాధించిన వ‌సూళ్లు, రికార్డులు కావు. కానీ.. ఈ విష‌యంలో నాకు అసంతృప్తి త‌ప్ప‌డం లేదు” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది స్వీటీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close