రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

హైదరాబాద్: అనంతపురంజిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఇవాళ చేసిన సుడిగాలి పర్యటన ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందనే చెప్పాలి. ఇవాళ ఉదయం బెంగళూరునుంచి అనంతపురంజిల్లా చేరుకున్న రాహుల్ ఓబుళదేవర చెరువు గ్రామానికి వెళ్ళి అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబసభ్యులకు 45మందికి రు.50,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పేదలు, రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ మాత్రమే పరిరక్షిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తే బీజేపీ వెనక్కు లాక్కుందని ఆరోపించారు. అక్కడనుంచి పాదయాత్ర చేపట్టారు. మధ్యలో ఆత్మహత్యచేసుకున్న కొందరు రైతుల కుటుంబాల ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కొండకమర్లలో పాదయాత్రను ముగించారు. దళితవాడకు వెళ్ళి ఒక దళితుడి ఇంట్లో భోజనం చేశారు.

రాష్ట్రాన్ని విభజించినందుకుగానూ కాంగ్రెస్‌ పార్టీని 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుగులేనివిధంగా చావుదెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదంటే ప్రజలకు ఆ పార్టీపై ఎంత ద్వేషం ఉందో చెప్పొచ్చు. ఎన్నికలకు ముందే పరిస్థితి అర్థమై అనేకమంది నాయకులు టీడీపీ, వైసీపీ పార్టీలలోకి జంప్ అయ్యారు. ఇక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు ఉడిగిపోయినట్లయింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏదో ఒక కార్యక్రమం చేపట్టి పార్టీలో కదలిక తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. అలాంటి పరిస్థితులలో ఇవాళ రాహుల్ చేసిన పర్యటన పార్టీలోకి కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. చిరంజీవి, కేవీపీ, పల్లంరాజు, రామచంద్రయ్య, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి, రామచంద్రయ్యవంటి అగ్రనేతలందరూ ఇవాళ్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన సక్సెస్ కావటంతో వారందరి ముఖాలలో ఉత్సాహం కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇలాగే ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూపోతే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close