రాహుల్‌పై విరుచుకుపడిన టీడీపీ నేతలు: రెచ్చిపోయిన పయ్యావుల

హైదరాబాద్: అనంతపురంజిల్లాలో ఇవాళ రైతు భరోసా పాదయాత్రను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిపై తెలుగుదేశంపార్టీనేతలు విరుచుకుపడ్డారు. రాహుల్ పర్యటనలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో మాట్లాడుతూ రాహుల్ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటించటానికి సమయం, సందర్భం ఏమైనా ఉందా అంటూ రుసరుసలాడారు. ఇక అనంతపురం టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేక్ కట్ చేసినట్లు రాష్ట్రాన్ని కట్ చేసింది, ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టకుండా మోసంచేసిందికూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అనంతపురంలో పర్యటించింది రాహుల్ కాదని, రాహువు అని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన రాహుల్‌లాంటివారిని తెగనరికినా పాపంలేదని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. రాహుల్‌కు విషయాలపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అతనొక మొద్దబ్బాయని అన్నారు. ఇక యనమల రామకృష్ణుడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీపై అంత ప్రేమ ఉంటే ప్రత్యేకహోదాకోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఏపీని ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. పదేళ్ళ పాలనలో కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకు పైసాకూడా విదల్చలేదని విమర్శించారు. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో మాట్లాడుతూ, రాహుల్ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రపర్యటనకు వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ లోని దొంగలంతో గజదొంగలపార్టీ వైసీపీలో చేరుతున్నారని, మళ్ళీ వారంతా కలిసి కాంగ్రెస్‌లో కలిసిపోతారని ఉమా అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అస‌లైన బంగార్రాజు నాన్న‌గారే: నాగార్జున‌

ఈ సంక్రాంతి 'బంగార్రాజు'దే. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్లు తెచ్చుకుంది. సోమ‌వారం కూడా వ‌సూళ్ల హ‌వా త‌గ్గ‌లేదు. ఈ వ‌సూళ్లు, అంకెలు నాగ్ ని సంతోషంలో ముంచెత్తాయి. ఆ ఆనందం.. రాజ‌మండ్రి...

జ‌గ‌న్ కి థ్యాంక్స్ చెప్పిన నాగ్‌

సినిమా టికెట్ రేట్లు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై ఇటీవ‌ల చిరంజీవి - జ‌గ‌న్ ల మ‌ధ్య భేటీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ భేటీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలిసింది.కాక‌పోతే.....

విడాకుల సైడ్ ఎఫెక్ట్స్ : ర‌జ‌నీ ఫ్యాన్స్ VS ధ‌నుష్ ఫ్యాన్స్‌

విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చి 24 గంట‌లు గ‌డిచిందో లేదో.. అప్పుడే త‌మిళ నాట ర‌జ‌నీ ఫ్యాన్స్, ధ‌నుష్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైపోయింది. ధ‌నుష్‌ని అన‌వ‌స‌రంగా అల్లుడ్ని చేసుకున్నారంటూ.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌,...

చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ !

మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ పుట్టిన రోజలకు కూడా విష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close