రైతుల త్యాగం-నేతల వైభోగం!

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరో గానీ, అమరావతి నిర్మాణానికి అసలు సిసలైన త్యాగాలు చేసింది మాత్రం రైతులే. వాళ్ల త్యాగాల పునాదులపై విదేశీ కంపెనీల చేత బడా భవంతులు కట్టించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రతి పైసా లెక్క చూసుకోవాల్సిన పేద రాష్ట్రం ఏపీలో ప్రజా ప్రతినిధులు మాత్రం జనం సొమ్ముతో వైభోగాలు అనుభవించడానికి తయారయ్యారు. ఏపీ శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి జీతభత్యాలను పెంచుకోవడానికి సిద్ధపడ్డ తీరు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

కేంద్రం ద్రవ్యలోటు భర్తీ చేయడం లేదని బీద అరుపులు అరుస్తూ ఉంటారు. ప్యాకేజీ కావాలి, ప్రత్యేక హోదాతో గ్రాంట్లు కావాలంటారు. దీనికి సహాయం కావాలి, దానికి నిధులివ్వండి అని నెలకోసారి ఢిల్లీకి వెళ్లి మొరపెట్టుకుంటారు. అసలే డబ్బులకు ఇబ్బందిగా ఉంటే ప్రజాప్రతినిధులు తమ జీతాలను తామే భారీగా పెంచుకున్నారు. ఖజానాపై, అంటే ప్రజలపై భారీగా భారం మోపడానికి రెడీ అయ్యారు. ఓటు వేసిన పాపానికి వీళ్ల భారాన్ని కూడా ప్రజలే భరించాలన్న మాట.

అమరావతి నేల ప్రత్యేకతే వేరు. మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూమి. బహుశా దేశంలో మరెక్కడా ఇంతటి బంగారం లాంటి భూమి ఉండదేమో. అలాంటి భూమిని, పైసా తక్షణ పరిహారం లేకుండా రైతులు ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఏడాదికి కొంత మొత్తం చెల్లింపు, డెవలప్ మెంట్ పూర్తయిన తర్వాత ఇంటి స్థలం కేటాయంపు వంటి హామీలతో తమ బంగారం లాంటి భూములను సర్కారుకు రాసిచ్చారు. కన్నతల్లి లాంటి పంట పొలానికి దూరమయ్యారు. డెవలప్ మెంట్ జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల త్యాగాన్న పొగడటానికి నిజంగా మాటలు సరిపోవు. మరి 24 గంటలూ ప్రజా సేవలో తరిస్తామని చెప్పే ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? ప్రతిదానికీ ప్రభుత్వాన్ని తిట్టే వైసీపీ ఏం చేసినట్టు? తమకు పెంచిన జీతాలు అవసరం లేదని అపర కోటీశ్వరులైన వాళ్లు మాటవరసకైనా అన్నారా?

చంద్రబాబు నుంచి జగన్ వరకూ వాళ్లు స్వయంగా ప్రకటించిన ఆస్తుల విలువను బట్టి చూస్తే వాళ్లేమీ పేదలు కాదు. మధ్య తరగతి వారు కాదు. వందలు వేల కోట్ల సంపద ఉన్న నాయకులూ కొందరున్నారు. అలాంటి వారైనా ప్రజలమీద భారం వద్దని అనలేదే? కనీసం తమకు పెంచిన వేతనం వద్దని చెప్పలేదే? రైతుల త్యాగాల ముందు ఈ నేతలు ఎందుకూ కొరగారు అని కడుపు మండిన ప్రజలు వ్యాఖ్యానిస్తే అది అబద్ధం అవుతుందా?

ఏ ఉద్యోగీ తన జీతాన్ని తానే పెంచుకోలేడు. ప్రపంచంలో ఎవ్వరూ తమ జీతాన్ని తామే పెంచుకోలేరు. ప్రజా సేవలో తరించే చట్ట సభల సభ్యులనే పేరుతో ఇష్టం వచ్చినట్టు తమ జీతభత్యాలు తామే పెంచుకునే ముందు ఒక్క క్షణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించారా? త్యాగాలు చేసిన రైతులను గుర్తు చేసుకున్నారా? ఇలాంటి ప్రజా ప్రతినిధులు ప్రజాధనానికి కాపలాగా ఉండి కాపాడతారా? రాష్ట్రాన్ని నిజంగానే ఉద్ధరిస్తారా? అది జనం నమ్మాలా? అధికార, ప్రతిపక్ష ప్రజా సేవకులే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close