తొక్కిసలాట వెనుక మరో కోణం – మీడియాను సిద్ధం చేసే యత్నం?

పోలీసు వాహనంతో సహా రాజమండ్రిలో దగ్ధమైన ఆరు వాహనాల మిస్టరీని ఆధారం చేసుకుని, గోదావరి పుష్కరాల మొదటిరోజు తొక్కిసలాటలో 27 మంది మరణాలనీ అనుమానాస్పద లేదా విద్రోహ చర్యగా చూపించే కోణం ఒకటి మీడియా ముందుకి వస్తోంది .

“పదకొండు రోజులు అపూర్వంగా సహకరించారు. ఇంకొక్కరోజు వుంది. కాస్త అప్రమత్తంగా వుండాలి. అనుమానానాస్పద పరిస్ధితులు వుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని రాష్ట్రప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ విలేకరులతో అన్నారు. ”ఏదైనా జరగవచ్చన్న ఎలర్ట్ వుందా” అన్న ప్రశ్నకు ”అదేమీలేదు ముందు జాగ్రత్తకోసమే తెలిసిన సమాచారాన్ని వెల్లడించడం వల్ల దర్యాప్తుకి అవరోధం కలగవచ్చు”అన్నారు.

విద్యుత్ షార్టు సరూ్క్యటు, సిలెండరు పేలుడు, విద్రోహచర్య మొదలుగా అన్నికోణాలనుంచీ అంబేద్కర్ విగ్రహంవద్ద అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశాన్ని బలపరచే రెండు చానళ్ళలో ఒక చానల్ ఎకూ్ల్సజివ్ అంటూ ప్రమాద స్ధలం వద్ద ఒకవాహనాన్ని కొందరు తోసుకుని లాగుకుని కదలిస్తున్న క్లిప్పింగును చూపించింది. ప్రమాదకారణాలు ఏమీలేని ఈ క్లిప్పింగ్ ప్రయోజనమేమిటి అనే అనుమానం వస్తుంది. సిసి కెమేరా చిత్రీకరించిన ఈ వీడియోను సెంట్రల్ కంటో్రలు రూమ్ మాత్రమే ఇవ్వగలదు. పెద్దస్ధాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇది ”లీక్” అయ్యే అవకాశమే లేదు.
ముఖ్యమంత్రి తీర్ధవిధులు నిర్వహిస్తున్న సమయంలో గంటల తరబడి క్యూలను ఆపివేసి చంద్రబాబు వెళ్ళిపోగానే గేటు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరించారు. అగ్గిప్రమాదం తరువాత మొదలైన ”అన్ని”కోణాల దర్యాప్తూ మొదటి రోజు దుర్ఘటనకు కూడా ఆపాదిస్తున్నారు. దీని ఫలితంగానే “ఆరోజు విద్యుత్ తీగలు తెగిపడ్డాయని ఎవరో వదంతి సృషించడం వల్లే తొక్కిసలాట జరిగిందనన్” వాదన రెండురోజులుగా ప్రచారం లోకి వచ్చింది. వివరణ అడిగితే అన్నికోణాలూ దర్యాప్తు చేస్తున్నాం అనిమాత్రమే పోలీసు అధికారులు చెబుతున్నారు.

అన్నికోణాలూ చూడటం పోలీసుల బాధ్యతే… ”ఫలానా కోణం నుంచి కూడా చూడాలి” అని పోలీసుబాసుల్ని నడిపించే రాజకీయ నాయకత్వం సూచిస్తే దర్యాప్తు ముగింపి ఎలా వుంటుందో ఎవరైనా ఊహించవచ్చు.

ప్రతి పదం ఎంతో అర్ధవంతంగా వుండేలా ఆచితూచి మాట్లాడే పరకాల ప్రభాకర్ మీడియా సమావేశంలో ”ఇంకొక్కరోజే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వుందాం” అనడంలో దర్యాప్తు లో కొత్త కోణాలను నిగూఢంగా సూచిస్తోంది.”పుష్కరాల ఏర్పాట్లు అద్భుతం, అమోఘం, అపూర్వం, సంపూర్ణంగా సంతృప్తికరం అని 95 శాతంకంటే హెచ్చు మంది యాత్రికులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించిన పరకాలకు చివరిరోజు అప్రమత్తంగా వుండాలి అనే హెచ్చరిక ప్రజలను భయాందోళనలకు లోను చేయదని బాగాతెలుసు.

మనం అనుకోని ఏదో కోణం కూడా తొక్కిసలాటలో వుందని మీడియాకు ముందస్తు సూచన ఇవ్వడమే రాష్ట్రప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు ప్రయోజనం అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close