వెటరన్‌ హీరోయిన్‌ గొడవ : మూలిగే నక్కపై తాటిపండు!

అసలే ముక్కిడి.. ఆపై పడిశం అన్న సామెత చందంగా తయారవుతున్నది తమిళనాట ఎన్నికలకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఏదో తమ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో కూడా బతికి ఉన్నది అని చెప్పుకోవడానికి పోటీలోకి దిగాల్సిందే తప్ప.. కాంగ్రెస్‌ పార్టీకి.. నామమాత్రంగా కూడా ఠికానా లేదనే సంగతి అందరికీ తెలిసిన సంగతే. అందుకే తమకు సొంతంగా బరిలోకి దిగే సత్తా ఏనాటికీ ఉండదు గనుక.. ఎవరో ఒకరి భుజాల మీద డిపెండ్‌ అయి, వారు దయపట్టిన సీట్లలో పోటీచేస్తుంటారు. ఈసారి కూడా డీఎంకే పొత్తుతో 41 సీట్లలో కాంగ్రెస్‌ పోటీచేస్తున్న సంగతి మనకు తెలుసు.
పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా.. ఎత్తుగడల్లో ముదిరిన కాంగ్రెస్‌ నేతలు ఎలాగో ఒకలా ఆరాష్ట్రంలో కూడా కొందరు సినీ సెలబ్రిటీలు తమ పార్టీలో కీలకంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఆ కోటాలోనే వెటరన్‌ హీరోయిన్‌, ఒకప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఖుష్బూ కూడా ఉంది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు. తన అందచందాల ప్రదర్శనలతో తమిళులకు అప్పట్లో వెర్రెత్తించిన ఈ ఉత్తరాది భామ తనకు గుడి కట్టి పూజించేంత క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే అదంతా గతం.. ఇప్పుడు అదే ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీకి గుదిబండగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆమె ఓ ఇంటర్వ్యూలో హిజ్రాలకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను వారంతా కలిసి తూర్పారపట్టడానికి కారణం అవుతున్నాయి. హిజ్రాలు తమను తిట్టినందుకు మాత్రమే కాంగ్రెస్‌ మీద ఎదురుదాడి చేయడంలేదు. ఉత్తరాదికి చెందిన ఖుష్బూ తమిళ మహిళల మనోభావాలు దెబ్బతినేలా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారంటూ పాత సంగతులన్నీ ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. ఏదో సినీగ్లామర్‌ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంటే.. ఇప్పుడు ఖుష్బూ పేరెత్తితేనే తమిళులు, మహిళలు మండిపడే పరిస్థితి ఏర్పడుతోంది. నాయకులు ఎంత సీనియర్లు అయినా.. నాలుక మీద అదుపులేకుండా.. ఇచ్చమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close