మెగా వాడకం మామూలుగా లేదు

చిరంజీవిని ప‌వ‌న్ క‌ల్యాణ్ వాడుకోలేదు. బ‌న్నీ వాడుకోలేదు. రామ్‌చ‌ర‌ణ్ అప్పుడ‌ప్పుడూ కాస్త ట్రై చేస్తున్నాడు.కానీ.. సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం ఫుల్లుగా వాడేస్తున్నాడు, చిరు పాట‌ల్ని, బిరుదినీ, స్టోరీల్నీ ఎవ్వ‌రూ వాడుకోనంత‌గా వాడేస్తున్నాడు సాయి. త‌న తొలి సినిమా రేయ్‌లో.. గోలీమార్ పాట వాడాడు. సుబ్ర‌మణ్యం ఫ‌ర్ సేల్‌లో గువ్వా గోరింక‌తో పాట‌ని రీమిక్స్ చేశాడు. ఇప్పుడు చిరంజీవి బిరుదు సుప్రీమ్ హీరోలో సుప్రీమ్‌ని టైటిల్‌గా చేసుకొన్నాడు. అంత‌టితో ఆగ‌లేదు. ఈసినిమాలో అందం ఇందోళం పాట‌నీ రీమిక్స్ చేసేశాడు.

అంతేనా అంటే.. అక్క‌డితో ఆగిపోలేదు. ఈ సినిమా క‌థ‌.. ప‌సివాడి ప్రాణం క‌థ‌కి పోలిక‌లు ఉన్నాయ‌ట‌. అదీ మావ‌య్య సినిమానే. అంటే.. హోల్ సేల్‌గా చిరుని తెగ పిండేసుకొంటున్నాడ‌న్న‌మాట ఈ మెగా మేన‌ల్లుడు. అయితే సుప్రీమ్ పేరు పెట్టే ముందు చిరంజీవి ప‌ర్మిష‌న్ తీసుకొన్నాడ‌ట‌. చిరు కూడా సంతోషంగా మేన‌ల్లుడికి టైలిల్ దానం చేశాడ‌ట‌. మ‌రి.. ఈ పేరు.. సాయి ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకొంటాడో చూడాలి. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close