విశాఖను ఎప్పుడు కరుణిస్తారు ప్రభూ?

విశాఖ రైల్వే జోన్ దశాబ్దాలుగా పెండింగులో ఉన్న డిమాండ్. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంపీలు మారుతున్నారు, డిమాండ్ మాత్రం అలాగే ఉంది. భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్ లో భాగంగా ఉన్న విశాఖకు ఒక ప్రత్యేక జోన్ కావాలనే డిమాండ్ అత్యాశ ఏమీ కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సగం విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగతా ప్రాంతమంతా దక్షిణమధ్య రైల్వేలో భాగంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగినా అలాగే కొనసాగుతోంది. విశాఖ జిల్లాలోని అనకాపల్లి వరకూ దక్షిణ మధ్య రైల్వేనే. దువ్వాడ దాటగానే తూర్పు కోస్తా జోన్ మొదలవుతుంది. దీనివల్ల అనేక విధాలుగా ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోంది. కొత్త రైళ్లు వేయాలన్నా, రైళ్ల రూటును పొడిగించాలన్నా ఇబ్బందిగా ఉంది.

తూర్పు కోస్తా జోన్ లో ఒరిస్సా వాళ్లదే పెత్తనం. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే రైళ్లను భవనేశ్వర్ వరకూ పొడిగించుకున్నా అడిగే అవకాశం లేదు. ఈ జోన్ లో మూడు డివిజన్లున్నాయి. వాల్తేర్ (విశాఖ), ఖుర్దా రోడ్, సంబల్ పూర్ డివిజన్లు దీనిలో భాగం. భౌగోళికంగా వాల్తేరు డివిజనే పెద్దది. ట్రాక్ కిలోమీటర్, రూట్ కిలోమీటర్లలో ఈ డివిజన్ విస్తీర్ణమే ఎక్కువ. కానీ ట్రాక్ విద్యుదీకరణలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఖుర్దారోడ్ డివిజన్లో 1965 కిలోమీటర్ల మేరు ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది.

తూర్పు కోస్తా జోన్ లో సరుకుల రవాణా ఆదాయం ఎక్కువగా వచ్చేది వాల్తేరు డివిజన్ నుంచే. విశాఖ పోర్టు, ఉక్కు ఫ్యాక్టరీ తో పాటు ఇంకా అనేక అవసరాల కోసం సరుకుల రవాణా జోరుగా జరుగుతుంది. ఉక్కుఫ్యాక్టరీకి బొగ్గు రవాణాకు, ఉత్పత్తి అయిన ఉక్కు రవాణాకు గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి విశాఖ పోర్టుకు, పోర్టు లో దింపిన సరుకును ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా గూడ్స్ రైళ్లను వాడతారు. కాబట్టి కార్గో హ్యాండ్లింగ్ ఎక్కువ. వాల్తేరు డివిజన్ ను వదులకుంటే ఈ ఆదాయం పోతుందనేది ఒరిస్సా అధికారుల ఉద్దేశం. అందుకే కేంద్రంలో చక్రం తిప్పుతారని, విశాఖకు జోన్ రాకుండా అడ్డుకుంటాని ఆరోపణలున్నాయి.

ప్రస్తుత రైల్వే మంత్రి సురేష్ ప్రభు వాస్తవిక దృష్టితో ఆలోచించే వ్యక్తి అని పేరు. ఆ శాఖలో అనేక మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. విశాఖ జోన్ అవసరం అనే విషయం ఆయనక అర్థమైందంటున్నారు. పైగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, ఎన్డీయేలో భాగస్వామి. విశాఖ ఎంపీ బీజేపికి చెందిన వారు. జోన్ గురించి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అది జరగక పోవడానికి కారణం ఏమిటో అర్థం కాదు. రైల్వే మంత్రి ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తిస్తే వీలైనంత త్వరగా విశాఖ జోన్ కల నిజమయ్యే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close