యాకూబ్ ఉరిపై దిగ్విజయ్, శశి తరూర్ వివాదాస్పద ట్వీట్‌లు

హైదరాబాద్: యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశితరూర్ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాకూబ్‌ను ఉరితీయటంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అవసరానికి మించి వేగం, అంకితభావం చూపాయని, కుల,మత,ప్రాంతాలకు అతీతంగా తీవ్రవాద కేసులన్నింటిలో ఇలాంటి అంకితభావాన్నే చూపాలని ట్వీట్ చేశారు. తీవ్రవాదానికి సంబంధించిన ఇతర కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తనకు సందేహాలు ఉన్నాయని, ప్రభుత్వ, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా ఉందని పేర్కొన్నారు. కలామ్, యాకూబ్ అంత్యక్రియలు ఒక్కరోజే జరగటాన్ని పోలుస్తూ మరో ట్వీట్ చేశారు. ఇద్దరు ముస్లిమ్‌ల అంత్యక్రియలు ఒక్కరోజే జరిగాయని, ఒకరు దేశానికి గర్వకారణమైతే, మరొకరు అపకీర్తి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.

మరోవైపు తిరువనంతపురం ఎంపీ శశి తరూర్ యాకూబ్ మెమన్‌ను ఉరి తీయడాన్ని వ్యతిరేకించారు. అంతేకాక దేశంలో మరణశిక్ష అమలునుకూడా తప్పుబట్టారు. ఉరిశిక్ష అమలు చేయటంవల్ల తీవ్రవాదదాడులు ఆగవని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక మనిషిని ఉరితీయటం తనకు బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ఇలాంటి హత్యలవలన మనమందరమూ హంతకులుగా మారిపోతున్నామని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ మండిపడింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రజలను అవమానించేవిధంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. అటు కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాలని, వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించగూడదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close