శక్తిమాన్ చనిపోయింది..దానిపై కూడా శవ రాజకీయాలే!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శక్తిమాన్ అనే పోలీసు గుర్రం నేడు మరణించింది. మార్చి 14వ తేదీన గణేష్ జోషి నేతృత్వంలో డెహ్రాడూన్‌లో భాజపా కార్యకర్తలు రావత్ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు గుర్రాలపై రాగా, గణేష్ జోషి శక్తిమాన్ అనే గుర్రంపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసారు. ఆ దాడిలో అది తీవ్రంగా గాయపడింది. దానికి ఆపరేషన్ చేసి ఒక కాలు కూడా తొలగించి దాని స్థానంలో ఒక కృత్రిమ కాలుని అమర్చారు. కానీ తీవ్రగాయాల కారణంగా అది ఈరోజు తుది శ్వాస విడిచింది. అది మళ్ళీ కోలుకోవాలని చాలా మంది ప్రజలు ప్రార్ధనలు కూడా చేసారు కానీ వారి ప్రార్ధనలు ఫలించలేదు.

మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తో సహా అనేకమంది నేతలు, జంతు ప్రేమికులు, ప్రజలు వచ్చి చనిపోయిన శక్తిమాన్ కి శ్రద్ధాంజలి ఘటించారు. అది తప్పకుండా కోలుకొని లేచి తిరుగుతుందని భావించామని కానీ దురదృష్టవశాత్తు మరణించిందని హరీష్ రావత్ బాధ పడ్డారు. చనిపోయిన శక్తిమాన్ కూడా రాష్ట్ర సేవలో ప్రాణాలు కోల్పోయిన ఒక వీర సైనికుడు వంటిదేనని రావత్ చెప్పారు.

నోరులేని మూగజీవి అని కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టి దాని మరణానికి కారకుడయిన గణేష్ జోషి నేటికీ తన తప్పును ఒప్పుకోవడం లేదు..పశ్చాతాపపడటం లేదు. పైగా తనను అప్రదిష్ట పాలుచేసేందుకే హరీష్ రావత్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శక్తిమాన్ కి సరయిన చికిత్స అందించకుండా చేసి దాని మరణానికి కారణమయ్యిందని ఆరోపిస్తున్నారు. గణేష్ జోషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంలో దానిపై విచారణ జరుగుతోంది. ఒక మనిషిని ఆ విధంగా కొట్టి చంపితే, దానిని హత్యగా భావించి చట్టప్రకారం శిక్షిస్తారు. కానీ గుర్రాన్ని హత్య చేస్తే దానికి చట్టం ఎటువంటి శిక్ష వేస్తుందో? అతను భాజపాకి చెందిన ఎమ్మెల్యే కనుక అసలు ఎటువంటి శిక్ష పడకుండానే తప్పించుకొంటారో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close