నామా మనోగతం : చంద్రబాబు అడిగితే ఓకే!

తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా దుర్భరంగా ఉంది. రాష్ట్రంలో ఏ మూల ఏ ఎన్నికలు జరిగినా.. వారికి పరాజయ పరాభవం తప్పడం లేదు. ఎన్నికల పర్వం మొదలవుతున్న సమయంలో మాత్రం.. నాయకులు తమ పార్టీని వీడిపోయినప్పటికీ.. కిందిస్థాయి ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ తమ వెంటే ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి వారే బలం అని.. వారి బలంతోనే ఈ ఎన్నికల్లో నెగ్గుతాం అని చాటుకుంటూ తెలుగుదేశం పార్టీ రంగ ప్రవేశం చేస్తుంది. తీరా రంగ ప్రవేశం చేసిన తర్వాత.. దారుణంగా పరాభవాన్ని మూటగట్టుకుంటూ ఉంటుంది. ఇది వారికి రివాజుగా మారిపోయింది. అయితే పాలేరు విషయంలో తెలుగుదేశం పార్టీ భిన్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. కనీసం డిపాజిట్‌ అయినా దక్కించుకుని పరువు కాపాడుకోవాలని ఆర్థికంగా ఎంతో బలమైన అభ్యర్థి నామా నాగేశ్వరరావును బరిలోకి దింపాలని టీటీడీపీ ప్లాన్‌ చేస్తున్నది. నామా కూడా సుముఖంగానే ఉన్నారని, చంద్రబాబుకు పార్టీ అధ్యక్షుడు రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చెప్పడం విశేషం. అయితే నామా నాగేశ్వరరావు ఇప్పటిదాకా అధికారికంగా తన సుముఖతను మాత్రం వ్యక్తం చేయలేదు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా అడిగితే, పోటీ చేయాల్సిందిగా నిర్దేశిస్తే మాత్రమే బరిలోకి దిగాలని నామా నాగేశ్వరరావు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుమ్మలతో ఆయనకు పాత వైరం కూడా ఉంది. అయినంత మాత్రాన ఇప్పుడు తెరాస ఉన్న హవాను తట్టుకుని ఏకంగా విజయం సాధించేయడం ఈజీ కాదనే భావన ఆయనలో ఉన్నట్లు సమాచారం. పైగా ఆయన పాలేరు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో.. చనిపోయిన వారి కుటుంబంలో వారికి పదవి దక్కేలా ఎన్నికకు సహకరించాలనే సంప్రదాయాన్ని తెరాస ధిక్కరించడాన్ని నామా నిరసించారు. ఇది కాంగ్రెస్‌కు అనుకూల మాట! ఆయన వైఖరిచూస్తే.. ఓడిపోయినా సరే.. ఏదో పార్టీకోసం పోటీచేయడమే తప్ప.. రాంరెడ్డి సుచరితను ఓడించడానికి కాదని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది.
అయితే చంద్రబాబు నోటినుంచి వస్తే తప్ప.. బరిలోకి దిగరాదని నామా భావించడం వెనుక ఒక మర్మం ఉన్నదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పాలేరు ఎన్నికలో దిగడం అంటే.. ప్రస్తుతానికి త్యాగం చేయడమే అని తెదేపా వారు భావిస్తున్నారు. నామా బరిలోకి వస్తే.. భారీగా ఖర్చు పెట్టడం గ్యారంటీ. ఆ ఖర్చు మొత్తం పార్టీకోసం చేసే త్యాగమే అని వారు భావిస్తున్నారు. పార్టీకోసం అంత పెద్ద త్యాగం చేస్తే, తగు మోతాదులో ప్రత్యుపకారం ఉండగలదని చంద్రబాబు నుంచి హామీ ఉంటే.. బరిలోకి రావచ్చునని నామా వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన మనోగతం ప్రకారం.. వ్రతం చెడ్డా ఫలం దక్కాలనే ఆలోచనలోనే ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close