టీకాంగ్రెస్‌ ఉత్తి మాటలే.. యాక్షన్‌లోకి దిగిన వైకాపా!

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు భుజానికెత్తుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ దాకా వస్తే గానీ తెలియదు అన్నట్లుగా ఇన్నాళ్లూ తాము పాల్పడుతూ ఉన్న వక్ర రాజకీయాలే.. ఇప్పుడు తమ పార్టీలను దెబ్బతీస్తూ ఉంటే సహించలేకపోతున్న వారు.. ఏకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేస్తాం అంటూ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు ప్రకటిస్తున్న ఆకర్ష పథకాల దెబ్బకు ప్రతిపక్షాలు కుదేలైపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్లనే ఇలా యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది నష్టపోతున్న ప్రతిపక్షాల వారి వాదన. ఇలాంటి నేపథ్యంలో కేంద్రానికి ఫిర్యాదులు చేసి.. ఈ అరాచక ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని వారు భావిస్తున్నారు.

ఒక రకంగా చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి ఈక్వల్‌గానే కనిపిస్తున్నది. కాకపోతే.. కేంద్రానికి ఫిర్యాదు చేయాలి.. జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఇటువైపు ఆకర్షించాలి అనే ఆలోచన ముందుగా తెలంగాణ కాంగ్రెస్‌ వారి మాటల్లో వ్యక్తమైంది. కొన్ని రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ జానారెడ్డి మాట్లాడుతూ… ఫిరాయింపుల వ్యవహారాన్ని, తెరాస ప్రజాస్వామ్యానికి చేస్తున్న చేటును రాష్ట్రపతి దృష్టికి, ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాం అని, సుప్రీం కోర్టులో కేసు వేస్తాం అని… ఢిల్లీస్థాయిలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఆకర్ష పథకం దెబ్బకు తమ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా ఇప్పటికీ కోల్పోతూనే ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కూడా ఇదే ఆలోచనతో ఉన్నది. అయితే వారు జానారెడ్డి లాగా మాటలకు పరిమితం కాకుండా.. అప్పుడే యాక్షన్‌లోకి దిగిపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డి సారథ్యంలో నాయకుల బృందం ఈనెల 25న ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవబోతున్నారు. 26న ప్రధానిని కలవడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలు సరిదిద్దడం అనేది వీరి ప్రధాన ఎజెండాగా ఉంది. ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులపాటూ ఉద్యమాలు నిర్వహించాలని కూడా వైకాపా నిర్ణయించడం విశేషం. ఈ లెక్కన.. ఫిరాయింపులపై అందరి దృష్టిని ఆకర్షించేలా వైకాపా ఫుల్‌ యాక్షన్‌లోకి దిగిపోయినట్లు తెలుస్తూనే ఉంది.

అయితే కామెడీ ఏంటంటే.. ఇటు జానారెడ్డి మాటలకు పరిమితం అయినా, జగన్‌ యాక్షన్‌లోకి దిగినా.. అనైతిక ఫిరాయింపుల మీద పోరాడే నైతిక హక్కు వీరికి ఉన్నదా అనేది జనానికి కలుగుతున్న సందేహం. అంతో ఇంతో జగన్‌కు కాస్త నైతిక హక్కు ఉందని అనవచ్చు. ఆయన పార్టీ పెట్టగానే కాంగ్రెస్‌ వారు వచ్చి చేరినప్పుడు వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లిన ఘనత ఆయనకు ఉంది. కానీ.. జగన్‌ తండ్రి వైఎస్సార్‌ హయాంలో గానీ.. జానారెడ్డి కేబినెట్‌లో కీలక వ్యక్తిగా ఉన్న రోజుల్లో గానీ.. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి అనైతిక ఫిరాయింపులకు పాల్పడిందనేది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే.. ఇప్పుడు అవికాస్త ఎక్కువగా జరుగుతున్నాయంతే. మరి జాతీయ స్థాయిలో వీరు సాగించదలచుకుంటున్న పోరాటం ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close