ఎన్టీఆర్‌తో గొడ‌వ‌ల్లేవ‌ట‌

నంద‌మూరి కుటుంబానికీ, ఎన్టీఆర్‌కీ మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని, వాళ్ల మ‌ధ్య మాట‌ల్లేవ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. హ‌రికృష్ణ‌, క‌ల్యాణ్ రామ్‌, ఎన్టీఆర్ ఓ బ్యాచ్‌.. మిగిలిన‌వాళ్లంతా ఓ బ్యాచ్‌. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌ని కావాల‌నే కొంత‌మంది దూరం పెట్టారు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ అభిమానులు సైతం అంగీక‌రిస్తారు. ఆఖ‌రికి తార‌క‌ర‌త్న‌కీ, ఎన్టీఆర్‌కీ మ‌ధ్య కూడా సన్నిహిత సంబంధాలు లేవు. కానీ.. తార‌క‌ర‌త్న మాత్రం ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి గొడ‌వ‌లూ లేవు, ట‌చ్‌లోనే ఉంటున్నాం… అంటున్నాడు.

”నేనూ, ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్.. మేం ముగ్గురం అప్పుడ‌ప్పుడూ క‌లుస్తుంటాం. స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తాం. మామ‌ధ్య గొడ‌వ‌ల్లేవు. మేం బ‌య‌ట క‌నిపించ‌నంత మాత్ర‌న క‌ల‌సి లేం అనుకొంటే ఎలా” అని క్వ‌శ్చ‌న్ చేస్తున్నాడు. తార‌క‌ర‌త్న న‌టించిన రాజా చేయివేస్తే త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు తార‌క‌ర‌త్న‌. ఈ సినిమాపైనే చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ”ఎన్టీఆర్ వారసుడిగా రాణించ‌డం అంటే మాట‌లు కాదు. మాపై ఎన్నో అంచ‌నాలుంటాయి. దానికి త‌గ్గ‌ట్టే క‌ష్ట‌ప‌డ్డా. కానీ అదృష్టం క‌ల‌సి రాలేదు.. ” అంటూ తెగ ఫీలైపోతున్నాడు ఈ హీరో. మ‌రి రాజా చేయివేస్తే తో అయినా ఆ ల‌క్ వెంట వ‌స్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

రాజమండ్రి లోక్‌సభ రివ్యూ : పురందేశ్వరి గెలుపు పక్కా !

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన...

ఎక్స్‌క్లూజీవ్: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డ‌బుల్ ట్రీట్’

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈనెల 9... విజ‌య్ పుట్టిన రోజున అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇదో పిరియాడిక్...

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close