చిరు క‌త్తిపట్టేస్తున్నాడోచ్‌… డేట్ ఫిక్స్‌

హ‌మ్మ‌య్య‌.. మెగా అభిమానుల‌ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర ప‌డింది. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి చూసీ అల‌సిన ఆక‌ళ్ల‌కు స్వాంతన చేకూరుతోంది. చిరంజీవి క‌త్తి ప‌ట్టేస్తున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయింది. ఈనెల 29న క‌త్తి సినిమాకి క్లాప్ కొట్ట‌బోతున్నారు. మే నుంచి షూటింగ్ కూడా మొద‌లెట్టేస్తారట‌. ఈ విష‌యాన్ని చిరు కాంపౌండ్ వ‌ర్గాలే వెల్ల‌డించాయి. త‌న 150వ చిత్రంగా తమిళ క‌త్తిని చిరంజీవి రీమేక్ చేయాల‌నుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి క‌త్తిలాంటోడు అనే టైటిల్ అయితే బాగుంటుంద‌ని చిరు భావిస్తున్నారు. వినాయ‌క్ స్ర్కిప్ట్ ప‌నులు పూర్తి చేసేశారు.

ముందు ఈ సినిమా విష‌యంలో చిరుకి కొన్ని అనుమానాలు ఉన్నా.. వినాయ‌క్ ప‌క‌డ్బందీ స్ర్కిప్ట్ చిరు చేతిలో పెట్ట‌డంతో చిరు ఓకే చెప్పేశార‌ట‌. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఈ సినిమాని ప్రారంభించాల‌ని చిరు వినాయ‌క్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ 100వ చిత్ర ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఇప్పుడు చిరు కూడా త‌న 150వ సినిమా ఓపెనింగ్‌ని అంత‌కంటే గ్రాండ్ గా చేయాల‌ని చూస్తున్నాడు. మ‌రి చిరు ఎవ‌రెవ‌రిని ఆహ్వానిస్తారో, ఆ వేడుక ఎంత ముచ్చ‌ట‌గా జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close