తెలకపల్లి వ్యూస్ : పుస్తకాలతో రాజకీయ యుద్దం!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆరోపణలతో ముద్రించిన పుస్తకాలను వైసీపీ అద్యక్షుడు జగన్‌ ఢిల్లీలో పంచిపెడుతున్నారనే వార్త ఆసక్తికరమైంది. వీటిని ఎవరు ఏ మేరకు చూస్తారనేది పక్కనపెడితే ప్రచారానికి రాజకీయ దాడికి మంచి ఆయుధాలుగా ఉపకరిస్తాయి. తెలుగునాట రాజకీయాల్లో ఈ పుస్తకాల యుద్ధం గురించి కొన్ని విషయాలు నాకు గుర్తుకు వచ్చాయి.

జగన్‌ సిబిఐ కేసు విచారణలో ఖైదీగా వున్నప్పుడు తల్లి విజయలక్ష్మమ్మ ఢిల్లీలో పెద్దలను కలిసి మద్దతు కోరడానికి కార్యక్రమం తీసుకున్నారు. అయితే ఈ లోగానే తెలుగుదేశం బృందం మొత్తం సమాచారంతో సిద్ధమైంది. వాటిని ముందే అన్ని పార్టీలకు అందించాలని భావించారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా మీడియా ప్రసారం చేసింది. ఈ చర్యతో మీరు జగన్‌కు మరింత ప్రచారం కల్పించబోతున్నారని ఒకరిద్దరు తెలుగుదేశం నేతల దగ్గర వ్యాఖ్యానించాను. అప్పటికే రోజూ ఉదయాన్నే ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జగన్‌పై ఒకటికి రెండు మీడియా కాన్ఫరెన్సులు జరుగుతుండేవి. ఇవి చాలక ఢిల్లీలోనూ జగన్‌ ఫోబియాను ప్రదర్శిస్తారా అని అడిగాను. మొత్తానికి ఆ ఆలోచన మానుకుని వూరికే వెళ్లి కలసి వచ్చారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌పై ‘రాజా ఆప్‌ కరప్షన్‌’ పుస్తకం తెలుగుదేశం ఢిల్లీలోనూ మీడియాలోనూ పంచింది. అయినా ఆయన విజయం సాధించారు.

ఇంకొంచెం వెనక్కువెళితే చంద్రబాబు నాయుడు హయాంలో సిపిఎం ప్రచురించిన ‘బాబు జమానా అవినీతి ఖజానా’ పుస్తకం తరచూ ప్రస్తావనకు వస్తుండేది. 2004 ఎన్నికలలోనే గాక తర్వాత కూడా కాంగ్రెస్‌ వారు దాన్ని పునర్ముద్రణ చేసి వినియోగించుకున్నారు. నిజానికి ‘లాటీ లూటీ కాంగ్రెస్‌ సర్కార్‌’ పేరుతో వైఎస్‌ పాలనపైనా సిపిఎం పుస్తకం ప్రచురించినా తెలుగుదేశం అంతగా వినియోగించుకోలేదు. చంద్రబాబు నాయుడు టీం విషయాలు బాగా సేకరిస్తుందని పేరుంది. వారు కష్టపడి పోగు చేస్తుంటారు కూడా కాని వైఎస్‌ టీం కూడా ఎక్కడెక్కడి విషయాలు పోగు చేసి ఉపయోగించుకోవడం వాస్తవం. ఈ రాజకీయ పుస్తకాల యుద్ధం పునరావృతమవుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close