అంజ‌లి పాప‌ని ప‌ట్టించుకోరేం..

స‌రైనోడు వ‌చ్చింది.. కోట్లు కోట్లు కొల్ల‌గొడుతోంది. బ‌న్నీ రేంజు పెరిగింద‌ని ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు. బోయ‌పాటి స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించీ తెగ మాట్లాడుకొంటున్నారు. ఆది పినిశెట్టి విల‌న్ గా ఇర‌గ‌దీశాడ‌ని మెచ్చుకొంటున్నారు. ర‌కుల్ సంగ‌తి స‌రేస‌రి. కేథ‌రిన్ గురించి క‌నీసం నెగిటీవ్ యాంగిల్ లో అయినా మాట్లాడుకొంటూనే ఉన్నారు. కానీ ఐటెమ్ సాంగ్ చేసిన అంజ‌లి గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అస‌లు స‌రైనోడులో అంజ‌లి ఉన్న సంగ‌తి కూడా చాలా మందికి రిజిస్ట‌ర్‌కాలేదు.

ఐటెమ్ సాంగ్ అంటే… అంద‌రి క‌ళ్లూ ఆ ఐటెమ్ గాళ్ మీదే ఉంటాయి. ఐటెమ్ భామ‌లుకూడా త‌మ శ‌క్తివంచ‌న లేకుండా… అందాలారేసి, ఆ ఐదు నిమిషాలూ దుమ్ము దులిపేసి వెళ్లిపోతారు. ఒక్క పాట క్లిక్క‌యితే…ఇక బోలెడ‌న్ని ఆఫ‌ర్లు వ‌రుస క‌డ‌తాయి. కానీ.. స‌రైనోడు లో అంజ‌లి సీన్ రివ‌ర్స్‌. ఈ ఐటెమ్ పాట‌లో క‌మెరా ఆమెపై ఫోక‌స్ అయ్యిందే లేదు. బ‌న్నీ స్టెప్పులు, శ్రీ‌కాంత్ ఊపుడు, జ‌య ప్ర‌కాష్‌రెడ్డి మేన‌రిజ‌మ్స్ చూపించినంత సేపు కూడా అంజ‌లి ఫేస్ చూపించ‌లేదు. దాంతో.. అంజ‌లికి రావ‌ల్సిన గుర్తింపు రాలేదు. దాంతో అంజ‌లి కూడా బాగా హ‌ర్ట‌వుతోంద‌ట‌. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెమ్ పాట ఛాన్సొస్తే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. అంద‌రూ స్టార్స్ గురించే మాట్లాడుకొంటారు త‌ప్ప‌.. ఐటెమ్ క‌ష్టాన్ని గుర్తించ‌రు. ఈ విష‌యంలో అంజ‌లి పాప‌కు ఈసారి బాగా అర్థ‌మై ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close