మొహం చాటేస్తున్న భాజపా నేతలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉన్నదని, కాంగ్రెస్‌ పార్టీ అంతరించి పోయిన ఈ రాష్ట్రంలో ఆ ఖాళీని తాము భర్తీ చేసినట్లయితే.. భవిష్యత్తులో ఒంటరిగా కూడా అధికారంలోకి రాగల స్థాయికి తమ పార్టీ చేరుకుంటుంది.. అని చాన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ మురిసిపోతూనే ఉన్నది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నాయకులు వచ్చే ఎన్నికలకు తెదేపా , భాజపా వేర్వేరుగా పోటీచేస్తాయని.. తామే బీజేపీ అభ్యర్థులు అయిపోతాం అని కూడా తమ ప్రయత్నాల్లో ఉన్న స్థానిక నాయకులు ఉత్సాహపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా ప్రత్యేకహోదా విషయంలో మోడీ సర్కారు చేసిన వంచన ఏపీలోని భాజపా నాయకులకు షాక్‌ తినిపించింది. ఏపీలో స్వతంత్రంగా తాము అధికారంలోకి రావడం అనేది తర్వాతి సంగతి.. ముందు ప్రజల వద్ద ఛీత్కారాలకు గురికాకుండా ఉంటే చాలునని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు బెదిరిపోతున్నారు.

మూడురోజులుగా రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా ముందుకు రావాలంటేనే మొహం చాటేస్తున్నారు. భయపడిపోతున్నారు. హోదా అంశం కీలకమైనది గనుక.. మీడియా వారిని అభిప్రాయం అడగకుండా వదలిపెట్టదు గనుక.. టీవీ ఛానెళ్లలో డిస్కషన్లకు ఆహ్వానించినప్పుడు ఏదో ఒకరిద్దరు బీజేపీ నాయకులు అందులో పాల్గొంటున్నారు తప్ప.. మరో రకంగా…వారు జనం ముందుకు రావడానికి సాహసించడం లేదు.

బీజేపీ పేరు చెప్పుకుని జనం ముందుకు ఏ నాయకుడు వచ్చినా జనం వారిని నిలదీసే పరిస్థితి ఏర్పడుతోంది. హోదా విషయంలో మోడీ సర్కారు ఇంత దారుణంగా మోసం చేశాక ఇంకా ఆ పార్టీలో ఉండడం ఎందుకు అంటూ జనం వారిని నిలదీసే పరిస్థితి ఏర్పడుతోంది. స్థానిక నాయకులు ఏదో తమకు భవిష్యత్తు ఉంటుందని మురిసిపోవడమే తప్ప.. ఆంధ్రప్రదేశ్‌ మీద భాజపాకు, ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి ఏమాత్రం శద్ధ్ర లేదని చాలా సందర్భాల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆ ఆశ కూడా వారికి లేదని తేలుతోంది. ఏపీలో పాలిస్తున్నది తమ మిత్రపక్షమే అయినా, తాము స్పష్టంగా ఇచ్చిన హామీలే అయినా, అవి చట్టబద్ధమే అయినప్పటికీ.. ఇలాంటి దొంగ నాటకాలు ఆడుతున్న నేపథ్యంలో భాజపాకు రాష్ట్రంలో కాలం చెల్లుతున్నదని చెప్పకతప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close