13న కేవీపీ బిల్లుకు అందరూ గొంతు కలపాల్సిందే!

మోడీ సర్కారు పరంగా ఇంకా కొత్తగా తెలియవలసిన మోసాలు ఏమీ లేవు. వారు చాలా స్పష్టంగా ఏం చేయదలచుకున్నారో అది చేశారు. ఏం చెప్పదలచుకున్నారో అది ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా చెప్పేశారు. మీ చావు మీరు చావండి అని తేల్చేశారు.. కనీసం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులందరూ, పార్టీ రహితంగా రాష్ట్రానికి కేంద్రంనుంచి సాధించుకోవాల్సిన ప్రయోజనాల గురించి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అయితే సరిగ్గా.. కేంద్రం యొక్క వంచన నిగ్గు తేలే సమయానికి మన గళాన్ని వినిపించడానికి మరో అవకాశం కళ్లెదుటే ఉంది. ఈనెల 13వ తేదీన కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లు రాజ్యసభలో ఓటింగుకు రానుంది. ఈ బిల్లు విషయంలో అన్ని పార్టీలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఎంపీలు ఐక్యంగా బిల్లుకు అనుకూలంగా ఓటువేసి తమ గళాన్ని వినిపించాల్సి ఉంది. మోడీ సర్కారు అనుసరిస్తున్న దుర్మార్గపు పోకడలను ఎండగట్టవలసి ఉంది.

కేవీపీ రామచంద్రరావు కొన్ని రోజుల కిందట ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన చట్ట ప్రకారం దక్కవలసిన అన్నీ చట్టబద్ధంగా ఇవ్వడం గురించి రాజ్యసభలో ప్రెవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై ఆరోజు సభలో తీవ్రస్థాయిలో ఉద్వేగభరితంగానే ప్రసంగాలు నడిచాయి. చివర్లో ఆయన ఓటింగుకు పట్టుబట్టినప్పటికీ.. కోరం లేని కారణంగా దానిని వాయిదా వేశారు. ఈనెల 13వ తేదీన కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మీద చర్చ మరియు ఓటింగ్‌ జరుగుతుంది.
ఈ బిల్లుకు అనుకూలంగా వీలైనంత ఎక్కువ మంది మద్దతు కూడగట్టడానికి కేవీపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. తెదేపాకు చెందిన రాజ్యసభ ఎంపీలతో కూడా అనుకూలంగా ఓటు వేయించడం గురించి ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా లేఖ రాశారు.

తాజాగా కేంద్రం లోని మోడీ సర్కార్‌.. ఎటూ ఏపీని వంచించడానికే కృతనిశ్చయంతో ఉన్నదని తేలిపోయిన తర్వాత.. ఫిబ్రవరి 13న కేవీపీ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా ఏపీలోని పార్టీలన్నీ సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెదేపా ఎంపీలు కూడా దానికి అనుకూలంగానే ఓటు వేయాలి. ఎటూ అది కాంగ్రెస్‌ బిల్లు కాదు. ఆ పార్టీతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు రావడానికి అవకాశం లేదు. అందుచేత తెదేపా వారు నిర్మొహమాటంగా సమర్థించవచ్చు. ఎన్డీయేలోని ఇతర పక్షాల నుంచి కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేసేలా మద్దతు కూడగట్టాలని కేవీపీ రామచంద్రరావు, చంద్రబాబునాయుడుకు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆ మేరకు స్పందించి.. ఎన్డీయే పక్షాలతో పాటు, తనకు సంబంధ బాంధవ్యాలు ఉన్న ఇతర పక్షాల వారితో కూడా మాట్లాడి బలం కూడగడితే రాష్ట్ర ప్రయోజనాల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు ఉంటుంది. అలా చేయకపోతే గనుక.. మోడీ సర్కారు పాదాల వద్ద మన రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేస్తున్నారనే ఆరోపణలు నిజం చేసినట్లుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close