22న `జెంటిల్‌మ‌న్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `జెంటిల్‌మ‌న్‌`. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘అష్టా చమ్మా’ తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “ మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ జ‌రుగుతోంది. డ‌బ్బింగ్ ప‌నులు కూడా తుదిద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నెల 12న తొలి టీజ‌ర్‌ను, 22న పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నాం. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన స్వ‌రాలను అందించారు. ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన నాలుగు ప్ర‌ధాన పాట‌లు, టైటిల్ థీమ్ సాంగ్ మెప్పిస్తాయి. అంద‌మైన రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించాం. అన్ని ర‌కాల భావోద్వేగాలున్న చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. హీరోనా,. విల‌నా అని టైటిల్ కింద పెట్టిన క్యాప్ష‌న్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించింది“ అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, ‘సత్యం’ రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close