కాన్స్ చిత్రోత్సవాల్లో రామ్ సోద‌రుడి సంద‌డి

ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘కాన్స్ చలన చిత్రోత్సవాల’ పైనే ఇప్పుడు అందరి దష్టీ ఉంది. ఈ నెల 11న ఆరంభమైన ఈ చిత్రోత్సవాలు 22 వరకూ జరుగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో ఇప్పటికే మన భారతీయ నటీమణులు ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్, సోనమ్ కపూర్ మెరిశారు. ఐష్ నటించిన ‘సరబ్ జిత్’ ప్రీమియర్ షో అక్కడ జరిగింది. కాగా, మన తెలుగు పరిశ్రమ నుంచి ‘బాహుబలి’ స్ర్కీనింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అలాగే, వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడ జరిగే చర్చా వేదికలో పాల్గొననున్నారు. అదో విశేషం అయితే.. అక్కడి షార్ట్ ఫిలిం విభాగంలో మన తెలుగు కుర్రాడి సినిమా సెలక్ట్ కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ చిన్న తమ్ముడు డా. రమేశ్ బాబు కొడుకు, హీరో రామ్ కజిన్ బ్రదర్ రాజా నిషాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ’60 ఎయిట్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధానంగా ఎనిమిదేళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే చిత్రం ఇది. 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందడం మనకు గర్వకారణం. ఈ చిత్రకథను దర్శకుడు రాజా పోతినేనియే రాసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close