అమ్మో.. నిత్య‌మీన‌న్‌

నిత్య‌మీన‌న్ మంచి న‌టి. గొప్ప పెర్‌ఫార్మర్‌. చిన్న సీన్ ఇచ్చినా… చింపేస్తుంది. మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులే.. ఆమెను చూసి ముక్కున వేలేసుకొన్నారు. అందుకే పెర్‌ఫార్మ్సెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌న్నీ ఆమెను వెదుక్కొంటూ వెళ్లిపోతున్నాయి. అయితే.. సెట్లో నిత్య ప్ర‌వ‌ర్త‌న మాత్రం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు తీసుకొస్తోంద‌ని టాక్‌. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో నిత్య‌ని ఏమీ అన‌లేం గానీ.. ఆమెతో ప‌నిచేయ‌డం మామూలు విష‌యం కాదంటూ, కొంత‌మంది ద‌ర్శ‌కులు గుస‌గుస‌లాడుకొంటున్నార్ట‌. వాళ్ల స్వీయ అనుభ‌వాల్ని ఏక‌రువు పెడుతున్నార్ట‌.

ఏ ద‌ర్శ‌కుడైనా ‘వ‌న్ మోర్‌’ అని చెబితే.. అంద‌రి ముందు సద‌రు ద‌ర్శ‌కుడ్ని నిత్య నిల‌దీసేస్తోంద‌ట‌. ‘వ‌న్ మోర్ ఎందుకు చేయాలి? నేను చేసిన త‌ప్పేంటి? క్లారిటీ ఇవ్వాల్సిందే ‘అంటోంద‌ట‌. ద‌ర్శ‌కుడు క్లారిటీగా చెప్ప‌గ‌లిగితే ఓకే. లేదంటే వ‌న్‌మోర్ చేయ‌నుగాక చేయ‌ను అంటోంద‌ట‌. సీన్లో నిత్య బాగాచేసినా, మ‌రో యాక్ట‌ర్ త‌ప్పు వ‌ల్ల ఆ షాట్ రీటేక్ చేయాల్సివ‌స్తుంది. అలాంట‌ప్పుడు మ‌రీ దారుణ‌మ‌ట‌. ‘మ‌రో యాక్ట‌ర్ త‌ప్పు చేస్తే.. నేనెందుకు మ‌ళ్లీ చేయాలి’ అంటూ నిల‌దీస్తోంద‌ట‌. నిత్య న‌ట‌న సూప‌ర్‌గానీ.. ఆమెతో సినిమా చేయ‌డం అనుకొన్నంత సుల‌భం కాద‌ని ద‌ర్శ‌కులు వాపోతున్నారు. మ‌రి నిత్య టెక్కో… లేదంటే త‌నంత న‌టి లేద‌నుకొంటోందో ఆమెకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close