అ..ఆ.. ఎలా ఉంద‌ట‌?!

త్రివిక్ర‌మ్ సినిమా అ..ఆ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెన్సార్ కూడా పూర్త‌యిపోయింది. అంద‌రూ అనుకొన్న‌ట్టే క్లీన్ యూ స‌ర్టిఫికెట్ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్ ఏమిటి?

  • అ..ఆ… కోసం త్రివిక్ర‌మ్ త‌న శైలిని పూర్తిగా మార్చిన‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ సినిమా అంటే పంచ్ డైలాగులు ఎక్కువ. కానీ ఈ సినిమా కోసం మాత్రం పంచ్‌ల డోసు బాగా త‌గ్గించాడ‌ట‌. మాట‌లు మ‌రీ పొదుపుగా వాడి… అస‌లు విష‌యాన్ని విజువ‌ల్‌గా చూపించడానికి ట్రై చేశాడ‌ని చెప్పుకొంటున్నారు.
  • లేడీ క్యారెక్ట‌ర్ల డామినేష‌న్ ఈ సినిమాలో ఎక్కువ‌గా క‌నిపించింద‌ని టాక్‌. స‌మంత‌, న‌దియా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అన‌న్య క్యారెక్ట‌ర్లు బాగా డిజైన్ చేసుకొన్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. వాళ్ల‌తో పోలిస్తే… నితిన్ పాత్ర‌కున్న ప్రాధాన్యం కాస్త త‌గ్గినా, ఈసినిమాతో నితిన్‌కి ఓ స‌రికొత్త ఇమేజ్ వ‌స్తుంద‌ని టాక్‌.
  • త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల్లో సునీల్ పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు సునీల్ హీరోగా బిజీ అయిపోయాడు. సునీల్‌కి ద‌క్కాల్సిన పాత్ర యువ హాస్య‌న‌టుడు ప్ర‌వీణ్ పోషించాడ‌ని, ఈ సినిమాతో ప్ర‌వీణ్ స్టారైపోతాడ‌ని చెప్పుకొంటున్నారు.
  • మిక్కీ జె.మేయ‌ర్ పాట‌లు మ‌రీ సో సోగా సాగాయ‌ట‌.
  • ఫ‌స్టాఫ్ కామెడీతో న‌డ‌పించిన త్రివిక్రమ్ సెకండాఫ్ మొత్తాన్నీ ఎమోష‌న్స్‌తో న‌డిపించేశాడ‌ట‌.
  • ప‌తాక స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టించే విధంగా సాగాయ‌ని, ఇదో ర‌కంగా ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని చెప్పుకొంటున్నారు. త్రివిక్ర‌మ్ అంటే న‌వ్వుల పంటే అనుకొన్న వాళ్లు ఈ సినిమా చూసి కాస్త నిరాశ చెందే అవ‌కాశాలున్నాయ‌ట‌. అయితే ఎమోష‌న్ సీన్లు క్లిక్క‌యితే అ.ఆ కి తిరుగుండ‌ద‌ని చెప్పుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close