బాల‌య్య కూడా వెళ్లిపోతున్నాడు

టాలీవుడ్లో హీరోల‌కు స‌మ్మ‌ర్ మూడ్ ఇప్పుడొచ్చింది. మ‌హేష్‌బాబు ఆల్రెడీ లండ‌న్ వెళ్లిపోయాడు. రెండు వారాల‌కు గానీ తిరిగిరాడు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా… ఫారెన్ చెక్కేస్తున్నాడు. ఈనెల 20 వ‌ర‌కూ బాల‌కృష్ణ మొరాకోలో ఉన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ అక్క‌డే జ‌రిగింది. మొరాకో నుంచి తిరిగొచ్చాక బాల‌య్య మ‌న‌సు విశ్రాంతి వైపు మ‌ళ్లింది. జూన్ ద్వితీయార్థంలో హైద‌రాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అంత వ‌ర‌కూ బాల‌య్య విశ్రాంతి తీసుకోవాల‌నుకొంటున్నార్ట‌.

అందుకే జూన్ 1న బాల‌కృష్ణ అమెరికా వెళ్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అక్క‌డ రెండువారాల పాటు విశ్రాంతి తీసుకొని తిరిగొస్తార‌ట‌. బాల‌య్య‌తో పాటు మోక్ష‌జ్ఞ కూడా అక్క‌డ‌కి వెళ్తున్నాడ‌ని తెలుస్తోంది. గౌత‌మి పుత్ర కోసం బాల‌య్య ఇప్ప‌టికే ప‌దికిలోలు త‌గ్గాడు. ఇప్పుడు మ‌రింత త‌గ్గాల‌ని భావిస్తున్నాడు. అమెరికాలో బాల‌య్య బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌త్యేకమైన క‌స‌ర‌త్తులు చేసొస్తాడ‌ట‌. అంటే బాల‌య్య‌ని త్వ‌ర‌లో మ‌రింత స్లిమ్‌గా చూడొచ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close