ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికలకు ఉచితంగా ప్రచారం నిర్వహించిపెడుతున్నట్టు కనిపిస్తుంది. వాటిపట్ల తమ అనుకూలతను వెల్లడిససఱ్తుంటే అనుయాయులు అర్థంచేసేకుంటారని వారి ఉద్దేశం. ఆంద్రజ్యోతి ఆర్కె నాకు మంచి మిత్రులు, అంతకు మించి నేను ఆ పత్రికకు దాదాపు పదేళ్లుగా కాలమిస్టును.భిన్నాభిప్రాయాలకు అది బాగా అవకాశమిస్తుందనే భావం వుంది.వీటితో పాటు విమర్శలూ వివాదాలు కూడా వుంటాయి.అందులో ఆర్కే రాసే కొత్తపలుకు చదవాల్సిందిగా చంద్రబాబు నాయుడు తమ పార్టీవారిని అధికారులకు సూచించినట్టు గతంలో వచ్చింది. ఇక వెంకయ్య నాయుడు వారి స్టాలనను సందరిశించి ప్రశంసలు అందించారు. తాజాగా అమరావతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబు నాయుడు అసలు అమరావతి అనే పేరు సూచించిందే రామోజీ రావు అని చెప్పేశారు. ఇక ఇప్పుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక హౌదాపై ఆర్కేతో ఓపెనన హార్టులో మాట్టాడతానన్నారు. ఉన్నత పదవుల్లో వున్నవారు ఇలా పదే పదే కొన్ని పత్రికలను మెచ్చుకుంటూ ప్రచారం కల్పించడం మంచిదేనా? దానివల్ల పక్షపాతంఆరోపణలు రావా? నిజంగా వుండవా? అయినా వెంకయ్య నాయుడు పదేళ్ల హౌదాపై ఇవ్వాలని పట్టుపట్టాల్సింది పోయి ఎవరో ఉద్దేశపూర్వకంగా తనపై దాడి చేస్తున్నారని తిట్టిపోయడం హాస్యాస్పదం. ఇన్నిసార్లు బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా హౌదా సాధ్యం కాదని ప్రకటిస్తే వెంకయ్య నాయుడు మాత్రం ఇంకా పరిశీలనలో వుందని నమ్మించచూడటం మంచిదేనా? నిధులన్నీ ఒకేసారి రావు, కేటాయింపులు ఒకేసారి జరగవు అంటూనే పొంతన లేని లెక్కలు చెప్పడం తప్ప ఇవ్వాల్సినంత ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి కదా!