అ..ఆని అలా చూడొద్దు : నితిన్‌

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అ.ఆ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనీ, ఈ సినిమాలో నితిన్ కంటే స‌మంత క్యారెక్ట‌ర్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంద‌ని.. ఆమె పాత్ర ముందు నితిన్ తేలిపోయాడ‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు. వీటికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేశాడు నితిన్‌. అ.ఆలో ఎవ‌రి ప్రాధాన్యం ఏమిటి? అని అడిగితే.. ఇదో ప్రేమ‌క‌థ అనీ, ప్రేమ‌క‌థ‌ల్లో ఎవ‌రి పాత్ర ఎక్కువ‌, ఎవ‌రి పాత్ర త‌క్కువ అనేది చూడ‌కూడ‌ద‌ని చెబుతున్నాడు. ఈ సినిమా ప్ర‌ధానంగా ఎనిమిది పాత్ర‌ల చుట్టూ న‌డుస్తోంద‌ట‌. ఆ ఎనిమిది పాత్ర‌లూ కీల‌క‌మే అంటున్నాడు నితిన్‌.

అన్న‌ట్టు ఈ సినిమాలో నితిన్ ఓ చెఫ్‌గా క‌నిపిస్తున్నాడు. ఇలాంటి పాత్ర చేయ‌డం త‌న‌కు చాలా కొత్త‌గా ఉంద‌ని, తాను ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల్లో న‌టుడిగా సంతృప్తినిచ్చింది ఇదే అంటున్నాడు. త్రివిక్ర‌మ్‌ని ఓ ద‌ర్శ‌కుడిగా చూళ్లేద‌ట‌. ఓ గురువుగా చూశాడ‌ట‌. త‌న జీవితానికి సంబంధించి ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌నుకొన్నా.. వెంట‌నే త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర‌కు వాలిపోతాన‌ని, ఆయ‌న స‌ల‌హా తీసుకొంటాన‌నీ అంటున్నాడు. అంతా ప్ర‌భావితం చేశాడ‌న్న‌మాట ఆ మాట‌ల మాంత్రికుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close