రాకెట్ స్పీడులో రకుల్ కెరీర్!

పంజాబీ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మూవీ కెరీర్ మాంచి ట్రాక్ మీదుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు దూసుకుపోతూనే ఉంది. బాలీవుడ్ లో కూడా గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయింది.

రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. షిమ్లా మిర్చీ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్లో విడుదల కాబోతుంది. రకుల్ లక్కీ గర్ల్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ షోలే దర్శకుడు రమేష్ సిప్పీ స్వయంగా షిమ్లా మిర్చికి దర్శకత్వం వహించారు. ఇందులో హేమమాలిని ముఖ్యమాత్ర పోషిస్తున్నారు. షోలే తర్వాత రమేష్ సిప్పీ, హేమమాలిని కలిసి పనిచేసిన సినిమాగా షిమ్లా మిర్చీ అప్పుడే పాపులారిటీ సంపాదించింది. అందులో రాజ్ కుమార్ రావ్ కు జోడీగా రకుల్ నటిస్తోంది. షిమ్లా మిర్చీ సూపర్ హిట్టయితే అమ్మడు తెలుగు కంటే హిందీ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తుందేమో.

రకుల్ ఈ ఏడాది తెలుగులో నటించిన రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర బాగానే సందడి చేశాయి. గత ఏడాది కిక్ 2, బ్రూస్ లీ సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, సరైనోడు బాగానే కలెక్షన్లు రాబట్టాయి. ఈ ఏడాది రకుల్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. వీటిలో షిమ్లా మిర్చి ఒకటి. ఇది కాకుండా రంచరణ్ తో జోడీ కట్టే ధ్రువ షూటింగ్ జరుగుతోంది.

బోయపాటి శీను, గోపీచంద్ మలినేనిల దర్శకత్వంలో సినిమాలు ఒకే అయ్యాయి. ఆ రెండూ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రకుల్ ఒక తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పింది. అది కూడా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. రకుల్ సినిమాలో ఉంటే సక్సెస్ గ్యారంటీ అనే టాక్ చాలా కాలంగా ఉంది. ఒకటి రెండు సినిమాలు నిరాశపరిచినా ఓవరాల్ గా రకుల్ లక్కీ గర్ల్ అని టాలీవుడ్ గుర్తించింది. అందుకే అంత డిమాండ్. మరి షిమ్లా మిర్చి హిట్టయితే ఈ టాలెంటెడ్ స్టార్ బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోతే ఎలా అనేది కూడా టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close