బీజేపీ, టీడీపీ రెండు ముక్కలాట

వెంకయ్య నాయుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపిస్తారా? నిర్మలా సీతారామన్ ను కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపిస్తారా? ఏంటి మోదీ అంతరంగం… ఏపీని మోదీ వదిలేశారా? బతిమలాడుకోవడం దేనికి అనుకున్నారా? టీడీపీ నేతలను సీటు అడిగితే ఫిటింగ్ ఉంటుందని కీడెంచి మేలు ఎంచారా? అదే సమయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలను ఓ సారి చూడాలి? జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందా?  బాబు మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పుతారా ? అలా జరుగుతుంటే ప్రధాని మోదీ చూస్తూ ఊరుకుంటారా ? బాబును కంట్రోల్ చేసే మార్గమేమీ కమలం పార్టీ నేతలకు లేదా ? అందులో భాగంగానే ఈ కిస్కామిస్కానా ? సరే ఇక చదవండి మరీ…

మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.రెండేళ్ల క్రితం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణంతో వచ్చిన రాజ్యసభ సీటును తనంతట తానుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలకు ఇస్తామని, అది కూడా నిర్మాలా సీతారామన్ కు ఇస్తామంటూ ఎదురు ఆఫర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అయితే రెండేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ నేతలను ఏపీ టీడీపీ నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చామంటూ చెబుతుంటే, రెవిన్యూ లోటు కూడా ఇవ్వలేదంటూ టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఏపీ నుంచి వెంకయ్యను బాబు రాజ్యసభకు పంపిస్తారని… ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో మూడింటిలో ఒకటి బీజేపీకి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనా తప్పని ఇప్పుడు తేలిందనుకోవాలి. లేకుంటే మరేదైనా జరుగుతుందో చూడాలి. నిర్మలా తన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తే  వెంకయ్య చాలా దూరంగా రాజస్థాన్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వేడి లేదు. వైసీపీ ఎమ్మెల్యేలను హ్యాపీగా టీడీపీలో చేర్చుకుంటున్న అధికారపక్షానికి పెద్దగా ఇబ్బందీ లేదు. కేంద్రంతో సయోధ్యతో ఉంటూనే, కావాల్సిన పనులు చేయించుకోవాలని టీడీపీ ఉబలాటపడుతుంది. అవును ఏపీపై కేంద్రానికి ప్రత్యేక ప్రేమ లేదు. బీజేపీపై టీడీపీకి ప్రత్యేక ఎఫెక్షనూ లేదు. ఇద్దరిదీ తాత్కాలిక ప్రేమ మాత్రమే,ఇద్దరిపై ఇద్దరికీ అపనమ్మకం… ఎవరిది పై చేయి అవుతుందోనన్న మీమాంశ.

మోదీ ఎన్నాళ్లు టాప్ స్లాట్ లో ఉంటారన్నదానిపై ఇప్పుడు టీడీపీ నేతల దృష్టంతా,తాము అడిగిందే తడువుగా తమకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని… గీచి గీచి ఇస్తున్నారన్న అభిప్రాయం సీఎం ఆయన సన్నిహితుల వద్ద అభిప్రాయపడుతున్నారన్న వార్తలు మనం నిత్యం వింటున్నాం… అయినా చేసేదేం లేదు కాబట్టి ఇప్పుడు మనం బీజేపీని ప్రశ్నించకుండానే వీలైనంత రాష్ట్రానికి తెచ్చుకోవాలన్న అభిప్రాయం పార్టీలో కన్పిస్తుంది.

ఇక్కడే అసలు విషయం చెప్పుకోవాలి. మోదీ విషయంలో బాబుది కంపల్షన్, బాబు విషయంలో మోదీకి ఎలాంటి ఇంప్రషనూ లేదు. ఇందుకంటే ఏపీపై బీజేపీ నేతలకు పెద్దగా అటాచ్మెంటూ లేదు. సో… ప్రత్యేక హోదా అటకెక్కింది. ఆ ఊసేలేదు. కేవలం ప్యాకేజీ మాత్రమే ఉంది. అది కూడా బీజేపీ పెద్దగా చెప్తుందన్న నమ్మకం లేదు. అందుకు మోదీ కాకపోతే మూడో ఫ్రంట్ అన్నది బాబుగారి ఫిలాసఫీ… అందుకే బాబు ఎప్పుడూ ఢిల్లీ రాజకీయాలపై ఓ కన్నేసి ఉంచుతారు. మహానాడులోనూ బాబుగారు అందే చెప్పారు. టీడీపీ దేశ రాజకీయాల్లో మారోసారి కీలక పాత్ర పోషిస్తుందని…ఏ సందర్భంలో ఎలా వ్యవహరించవచ్చో బాబుకు బాగా తెలుసు. మోదీది వాపు కాదు బలుపు అన్న ధీమా బాబులో ఉంది. ఢిల్లీలో మోదీ వీకెనెస్ మొదలైతే చక్రం తిప్పొచ్చన్న భావన ఆయనది. ఏపీలో రెండోస్సారి అధికారం తనదేనన్న అభిప్రాయంలో బాబు ఉన్నారు. అందుకే ఆయన మూడో కూటమి… జాతీయ రాజకీయాలన్న ఆశలో కాలం గడిపేస్తున్నారు. ప్రధాని పీఠంపై ఆశపడుతున్న మమత బెనర్జీ, నితీష్ కుమార్ లతో చేయి కలిపితే ఎలా ఉంటుంది. యూపీలో ఫలితాలు ఎలా వస్తాయన్న ముందుచూపు బాబులో ఉంది.

మోదీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న లాలూ, నితీష్, మమత, కేజ్రీవాల్ లాంటి నేతల మద్దతు తనకు కచ్చితంగా ఉంటుందని… వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకే పరిమితమైతే అప్పుడు చక్రం తిప్పాలన్న యోచనలో బాబు ఉన్నారు. అందుకు ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఉండనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలపై దయతో వ్యవహరించి సహకరించాలని మమత బెనర్జీ ప్రమాణస్వీకారం సందర్భంగా లాలూ కోరారు కూడా. సో బాబు ఓ కంట ఢిల్లీ పాలిటిక్స్ ను పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ నేతలతో అంటకాగుతున్న సుజనా చౌదరి లాంటి నేతలకు క్లాస్ కూడా పీకుతున్నారని పార్టీ నేతలు చెప్పుకుంటారు. బయటకు అలా చెప్పినా ఢిల్లీలో సుజనా పలుకుబడి అంతా బీజేపీ నేతల దయాదాక్షాణ్యాలపైనే ఆధారపడే ఉంటుంది కదా…

ఇక కొసమెరుపు ఏంటంటే… జగన్ విషయంలో మోదీ అందుకే కొంచెం ఉదారంగా ఉన్నారని కొందరు కమలం పార్టీ నేతలు అంటుంటారు. బాబు నమ్మకమైన మిత్రుడు కాదని… జగన్ ను ఊసిగొల్పుతుంటేనే బాబు లైన్లో ఉంటారన్న అభిప్రాయం కమలం పార్టీ నేతల మైండ్ లో ఫిక్సైపోయింది. జగన్ కూడా అంతే కాంగ్రెస్ పార్టీతో తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎవరైతే నాకేంటి… మంచిగా ఉంటే పోలా… బాబుది ముగిసే అధ్యాయం… తనదే ఆరంభమనే… అభిప్రాయంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. సో బాబు అటు వెళ్తే… జగన్ ఇటు వెళ్తారు… జగన్ ఇటుంటే బాబు అటు వెళ్తారు… రాజ్యసభకు వెంకయ్య, నిర్మలా ఎంపిక కూడా అదే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అటు బీజేపీకిగానీ, ఇటు టీడీపీకీ గానీ… ఇది రెండు ముక్కలాటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close