తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ ఇమేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కు, ద్రావిడ రాజకీయ ఉద్ధండులు స్టాలిన్ , పళనిస్వామిల నుంచి మునుపెన్నడూ లేని సవాళ్లు ఎదురవుతున్నాయి. అవి నేరుగా వస్తున్న సవాళ్లు కాదు. ఓ ప్రత్యేకమైన ట్రాప్. విజయ్ ప్రత్యేకం కాదని.. ఆయన కూడా ఓ సాధారణ రాజకీయ నేతేనని నిరూపించేలా ఆ ట్రాప్ వేశారు. ఇప్పటి పరిణామాలు చూస్తే విజయ్ ఆ ట్రాప్‌లో పడ్డారు. తన పార్టీని మరో అన్నాడీఎంకేను చేసుకుంటున్నారు.
అందరిలాంటి వాడే అనే ముద్ర!
తమిళ రాజకీయాల్లో సినిమా గ్లామర్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే, డీఎంకే , అన్నాడీఎంకే పార్టీలు ఇప్పుడు విజయ్ను ఒక అసాధారణ నేతగా కాకుండా, కేవలం అధికారం కోసం పాకులాడే సగటు రాజకీయ నాయకుడిగా చిత్రీకరించడంలో సఫలమవుతున్నాయి. విజయ్ తన పార్టీ బలోపేతం కోసం అన్నాడీఎంకే చీలిక వర్గాలను ఆశ్రయించడం, టీటీవీ దినకరన్ వంటి నేతల అనుచరులను చేర్చుకోవడంపై ప్రజల్లోకి సైలెంట్ సంకేతాలు పంపుతున్నాయి. సిద్ధాంతాలు అ చెప్పిన విజయ్, చివరకు పాత నేతలతోనే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు. దీనివల్ల విజయ్ చుట్టూ ఉన్న ఆ కొత్త మోజు క్రమంగా కనుమరుగై, ఆయన కూడా పాత నేతల బాటలోనే నడుస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.
మ్యాజిక్ మార్క్ కోసం అపవిత్ర పొత్తులు
రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్‌తో రావాలని ప్రయత్నిస్తున్న విజయ్ను, కేవలం సీట్ల కోసం చిన్న పార్టీల వెంట పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా డీగ్రేడ్ చేస్తున్నారు. అధికార దాహంతోనే ఆయన చిన్న చిన్న గ్రూపులను కలుపుకుంటున్నారని, ఇది ఆయన చెప్పే తమిళ జాతీయవాదం, అవినీతి రహిత పాలన కు విరుద్ధమని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ తన కోర్ టీమ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో చేస్తున్న పొరపాట్లు, సీనియర్ అడ్వైజర్ల విషయంలో జరుగుతున్న గందరగోళం ప్రజల్లోకి వెళ్తోంది. జ్యోతిష్యుడ్ని సీఎంవోలో నియమించడం ఓ పెద్ద రాంగ్ స్టెప్‌గా మారింది. విజయ్ ప్రకటించిన ఉచిత పథకాలు, భారీ హామీలపై ద్రావిడ పార్టీలు ఒకే మాటను వల్లెవేస్తున్నాయి.
సైలెంట్‌గా పొలిటికల్ ట్రాప్‌లోకి
విజయ్ ఒక ప్రత్యామ్నాయ శక్తి గా కనిపించాల్సింది పోయి మరో అన్నాడీఎంకేగా మారిపోతున్నారు. ఈ ముద్రను ఆయన వెంటనే చెరిపివేయకపోతే, తమిళ ప్రజల మనసుల్లో ఆయన ఒక సీరియస్ పొలిటికల్ ఫోర్స్‌గా కాకుండా, కేవలం ఒక సినిమా హీరో రాజకీయ ప్రవేశం లాగే మిగిలిపోయే ప్రమాదం ఉంది. విజయ్ తనపై పడుతున్న ఇతర నేతల్లాంటి వారే నే ముద్రను తొలగించుకోవాలంటే, కేవలం సినీ గ్లామర్‌పై ఆధారపడకుండా బలమైన గ్రౌండ్ లెవల్ ఆర్గనైజేషన్‌ను నిర్మించుకోవాలి. ప్రత్యర్థులు చేస్తున్న డీగ్రేడ్ పాలిటిక్స్‌ను ధీటుగా తిప్పికొట్టేలా తన అజెండాను మరింత స్పష్టంగా, ప్రజలకు చేరువయ్యేలా రూపొందించుకోవాలి.
