తెలంగాణ రాజకీయాల్లో ఇప్పసారా బ్రాండ్ అంబాసిడర్‌గా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఎక్కడ లేని ఆవేశం, ఊగిసలాట వచ్చేస్తుంటాయి. అసలు పవన్‌కు, ఈయనకు ఏం సంబంధమో ఎవరికీ అర్థం కాదు కానీ, జనసేనాని ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే గారు మైక్ ముందు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతుంటారు. తాజాగా ఏపీలో నాగేశ్వర్‌పై నమోదైన కేసుల ఇష్యూ నడుస్తుంటే, అందులోకి కూడా దూరిపోయి తన మార్కు పవన్ ఫోబియా ను బయటపెట్టుకున్నారు ఇప్పసారా ఎమ్మెల్యే.
ఈ వ్యవహారంతో అస్సలు సంబంధం లేకపోయినా, మధ్యలోకి అనవసరంగా అమరావతి రాజధాని టాపిక్‌ను లాగి సరికొత్త కామెడీకి తెరలేపారు అనిరుధ్ రెడ్డి. ఏపీ వాళ్లు అమరావతిని నిర్మించుకోవడం ఎందుకు దండగ అని ప్రశ్నిస్తూ.. ఆంధ్రా వాళ్లు ఇక్కడికి రావద్దు.. గో బ్యాక్ ఆంధ్రా అంటూ పిలుపునిస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా, అమరావతిని వదిలేసి మా జడ్చర్లకే వచ్చేయండి.. ఇక్కడే రాజధాని కట్టుకోవడానికి ఐదు వేల ఎకరాల భూమి నేనే ఇప్పిస్తా అంటూ ఏకంగా ఏపీ ప్రభుత్వానికే బంపర్ ఆఫర్ ప్రకటించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు.
అయితే, ఐదు వేల ఎకరాల భూమి ఇప్పిస్తానంటూ రాష్ట్రాల సరిహద్దులు దాటి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్న ఈ లీడర్ గారి అసలు పలుకుబడి ఏంటో రీసెంట్గా జరిగిన స్థానిక పరిణామాలు తేటతెల్లం చేశాయి. జడ్చర్లలో అంత పెద్ద నియోజకవర్గాన్ని ఏలుతున్నానని చెప్పుకునే అనిరుధ్ రెడ్డి.. తన సొంత గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనీసం తన మనుషులను కూడా గెలిపించుకోలేకపోయారు. సొంత ఊరి జనం కనీసం పంచాయతీ వార్డుల్లో కూడా నమ్మని స్థాయి ఇమేజ్ పెట్టుకుని, ఇప్పుడు ఏపీ రాజధాని భూమి ఇస్తానని చెప్పేదాకా వ్యవహారం సాగుతోంది.
సొంత నియోజకవర్గంలో పట్టు సడలుతున్న తరుణంలో, కేవలం మీడియా అటెన్షన్, పబ్లిసిటీ కోసమే పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. పవన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే యూట్యూబ్ థంబ్ నెయిల్స్లోనైనా హైలైట్ అవ్వచ్చనేది ఈ ఇప్పసారా ఎమ్మెల్యేగారి స్ట్రాటజీ కావచ్చు. ఇలాంటి వింత పలుకుబడిని, విచిత్రమైన లాజిక్కులను నమ్ముకుని పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడం ఒక్క అనిరుధ్ రెడ్డి కే చెల్లిందని స్థానిక ఓటర్లు నవ్వుకుంటున్నారు.
