క‌త్తికి క్లాప్ : చిరు లేడు

చిరంజీవి 150వ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. క‌త్తిలాంటోడు స్ర్కిప్టు పూర్తి స్థాయిలో రెడీ అవ్వ‌డంతో చిరు.. షూటింగ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జూన్ మొద‌టి వారంలోనే క‌త్తికి క్లాప్ కొట్టేస్తారు. అయితే… ఈ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొన‌డం లేద‌ని టాక్‌. చిరు లేని సన్నివేశాల్ని ముందుగా షూట్ చేస్తార‌ని తెలుస్తోంది. చిరు క‌త్తి సినిమా కోసం కాస్త స్లిమ్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. అయితే.. ఆ ఎఫుక్ట్ ఇంకా ఆయ‌న లుక్‌పై క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికి 6 కిలోలు త‌గ్గిన చిరు… మ‌రో 4 కిలోలు త‌గ్గాల‌ని టార్గెట్ ఫిక్స్ చేసుకొన్నార్ట‌. పూర్తి స్థాయిలో త‌గ్గిన త‌ర‌వాత‌.. కెమెరా ముందుకు రావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో.. తొలుత చిరు లేని మిగిలిన సన్నివేశాల్ని తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం.

త‌మిళ క‌త్తిలో సంతానం చేసిన పాత్ర‌కు సునీల్‌ని సంప్ర‌దించిన సంగ‌తి తెలిసిందే. సునీల్ కాల్షీట్లు ఖాళీ లేక‌పోవ‌డంతో ఆ ఛాన్స్ వెన్నెల కిషోర్‌క ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. క‌థానాయిక‌గా అనుష్క పేరు దాదాపుగా ఖాయ‌మైపోయిన‌ట్టే. త్వ‌ర‌లోనే చిత్ర‌బృందం ఆ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close