స‌మంత చేసిన త‌ప్పేంటి?

స‌మంత లో ఈమ‌ధ్య ప‌రిప‌క్వ‌త బాగా ఎక్కువైంది. ఏ విష‌య‌మైనా ప‌రిణ‌తితో మాట్లాడుతోంది. త‌ప్పొప్పుల‌ను బాగానే బేరీజు వేస్తోంది. అందుక‌నేనేమో ఈమ‌ధ్య స‌మంత‌కు వ‌రుస‌గా విజ‌యాలు అందుతున్నాయి. త‌మిళంలో తెరి సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో 24, అ.ఆ హిట్లు కొట్టేశాయి. ఇప్పుడు స‌మంత టైమ్ న‌డుస్తోంది. అయితే.. `నేనిప్పుడే కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి` అంటోంది స‌మంత‌. ఎందుకంటే విజ‌యం వ‌చ్చిన గ‌ర్వంతో త‌ప్పులు చేసే ఛాన్సెక్కువ ఉంటుంద‌ని లాజిక్ తీస్తోందీ అమ్మడు.

గ‌తేడాది వ‌ర‌కూ త‌నకు బ్యాడ్ పిరియ‌డ్ న‌డిచిన సంగ‌తి గుర్తు చేసుకొంటోంది స‌మంత‌. ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌లో అవ‌కాశం వ‌స్తే చాలు.. అనుకొనేద‌ట‌. ఆ త‌ర‌వాత హిట్టు కాంబినేష‌న్ ని చూసి ప‌డిపోయేద‌ట‌. హీరో కోస‌మో, ద‌ర్శ‌కుడి కోస‌మో, బ్యాన‌ర్ వాల్యూ కోస‌మో సినిమాలు చేసేద‌ట‌. దాని వ‌ల్లే ఒక ద‌శ‌లో త‌న‌కు వ‌రుస‌గా ఫ్లాప్స్ వ‌చ్చాయ‌ని, అదెంత త‌ప్పో ఇప్పుడు అర్థ‌మైంద‌ని చెప్పుకొచ్చింది. క‌థ న‌చ్చ‌క‌పోతే ఎంత పెద్ద హీరో అయినా చేసేది లేద‌ని తెగేసి చెబుతోంది. అంతా బాగానే ఉంది.. మ‌రి బ్ర‌హ్మోత్స‌వంలో ఏం న‌చ్చింద‌ని ఆ సినిమా ఒప్పుకొందో?? మ‌హేష్ బాబు ప‌క్క‌న కనిపిస్తే చాల‌నుకొందా, అంద‌రికీ వ‌ర్తించే సూత్రం మ‌హేష్ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close