రామ్ చుట్టూ మూగిపోయారు

ఇండ్ర‌స్ట్రీ ఎప్పుడూ అంతే! హిట్ వ‌స్తే చాలు… ఇక్క‌డ ఓడ‌లు బ‌ళ్లు… బ‌ళ్లు ఓడ‌లు అవ్వ‌డానికి రెడీగా ఉంటాయి. హిట్ అనే ప‌దం విన‌గానే.. జ‌నాలు మూగిపోతారు. ఇప్పుడు రామ్ ప‌రిస్థితి కూడా అంతే. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రామ్‌కి హిట్టు లేదు. నేను శైల‌జ‌.. రామ్ కెరీర్‌కి స‌రికొత్త ఊపు తెచ్చింది. దాంతో.. రామ్‌కి మ‌ళ్లీ క్రేజ్ పెరిగిపోయింది. రామ్‌కోసం కొత్త క‌థ‌లు సిద్ద‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం సంతోష్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు రామ్‌. గోపీచంద్ మ‌లినేని కూడా రామ్‌కోసం ఓ క‌థ రెడీ చేశాడ‌ట‌. రామ్‌తో ఇది వ‌ర‌కు ఎందుకంటే ప్రేమంటే సినిమా చేసిన క‌రుణాక‌ర‌న్ ఆల్రెడీ రామ్‌కి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు క్యూలో నిల‌బ‌డ్డాడు,

ప‌టాస్ తో తొలి అడుగులోనే గుర్తింపు తెచ్చుకొన్నాడు అనిల్ రావిపూడి. సుప్రీమ్ తో మ‌రో హిట్ కొట్టాడు. ఎంట‌ర్ టైన్ మెంట్ పోర్ష‌న్ బాగా రాస్తాడ‌ని అనిల్‌కి పేరుంది. అలాంటి క‌థ‌ల‌కు రామ్ స‌రిగ్గా స‌రిపోతాడు. అందుకే ఇప్పుడు రామ్ కి ఓ క‌థ రాసి, సిద్ధం చేశాడ‌ట‌. రామ్‌కీ ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని టాక్‌. మ‌రి వీళ్లంద‌రికీ రామ్ ఎలా డేట్లు స‌ర్దుబాటు చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close