‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కూ అటు ప‌వ‌న్ కు, ఇటు ఆయ‌న అభిమానుల‌కు సినిమాల గురించి ఆలోచించేంత టైమ్ లేదు. అయినా స‌రే… వేస‌వి గాలుల్లో.. ఓ పిల్ల తిమ్మెర‌లా.. ప‌వ‌న్ సినిమాల‌కు సంబంధించిన ఓ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మే 2న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రాబోతోంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా.

మే 2.. ఉద‌యం 9 గంట‌ల‌కు టీజ‌ర్‌ని బ‌య‌ట‌కు వ‌దులుతారు. ‘వీర‌మ‌ల్లు’ ప‌వ‌న్ కు చాలా ముఖ్య‌మైన సినిమా. దీనిపై నిర్మాత ఏ.ఎం.ర‌త్నం బాగా ఖ‌ర్చు పెట్టారు. ఈ సినిమాపై ర‌క‌ర‌కాల వ‌దంతులూ వినిపించాయి. సినిమా ఆపేస్తార‌ని, ద‌ర్శ‌కుడు మార‌తాడ‌ని ఎన్నో ర‌కాలుగా మాట్లాడుకొన్నారు. కానీ టీమ్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకొంటూ వెళ్తోంది. ఎన్నిక‌లు అయ్యాక‌.. అటు ‘ఓజీ’కీ ఇటు ‘వీర‌మ‌ల్లు’కీ స‌మానంగా డేట్లు కేటాయించి, రెండు సినిమాల్నీ ఒకేసారి పూర్తి చేస్తార‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు.

ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీజ‌ర్‌లో పొలిటిక‌ల్ డైలాగులు ఏమైనా సంధిస్తారా? అనే ఆస‌క్తి వ్య‌క్తం అవుతోంది. ఇది పొలిటిక‌ల్ చిత్రం కాదు. కానీ.. ‘పాల‌న‌’ త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించే ఛాన్స్ అయితే పుష్క‌లంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close