ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్ పొలిటికల్ మేనేజ్ మెంట్ ) సంస్థ ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది అనే అంశంపై చేపట్టిన సర్వే ఫలితాన్ని విడదల చేసింది.

ఏపీ ఎన్నికలపై ఇండియన్ పోలిటికల మేనేజ్ మెంట్ అనే సంస్థ 34రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. 662 మంది సిబ్బంది ద్వారా 3, 82, 576 శాంపిల్స్ సేకరించి సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కూటమి 97స్థానాల్లో విజయం సాధిస్తుందని, 108- 120సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. వైసీపీ 34 సీట్లను కైవసం చేసుకుంటుందని..ఆ పార్టీకి 41 – 54 సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది. 43నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నడుస్తోందని పేర్కొంది.

ఉత్తరాంధ్ర రీజియన్ లో 34 స్థానాలు ఉండగా కూటమి అత్యధికంగా 18స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీ 7స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 9 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉందని తెలిపింది. గోదావరి జిల్లాలో 34 స్థానాలకు కూటమి 23స్థానాలు, వైసీపీ కేవలం 6 సీట్లు మాత్రమే సాధిస్తుందని, ఐదు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉందని తెలిపింది.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూటమి 39 స్థానాల్లో గెలుపొందుతుందని… వైసీపీ కేవలం 4 స్థానాలే గెలుచుకుంటుందని ,11 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉందని తేల్చింది. జగన్ రాయలసీమపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒకటి రెండు సీట్లు మినహా సీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ కూటమి 18 – 22 స్థానాలు గెలుస్తుందని, వైసీపీ 30- 44స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close