అనుష్క స‌న్యాసం తీసుకొంటోందా?

కెరీర్ కొత్త‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి చెల‌రేగిపోయింది స్వీటీ అనుష్క‌! అవే ఆమెకు స్టార్ డ‌మ్ తీసుకొచ్చాయి. అరుంధ‌తి సినిమాతో నెంబ‌ర్ వ‌న్ స్థానంలోకి వెళ్లిపోయింది. ఆ త‌ర‌వాత‌.. స్వీటీ ప‌ద్ధ‌తి మార్చింది. కాస్త పద్ధ‌తైన పాత్ర‌లే చేస్తూ వ‌చ్చింది. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి అందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ‌లు. ఈసారి.. ఇంకాస్త అడుగుముందు వేసి, స‌న్యాసినిగా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌. నాగార్జున – కె.రాఘ‌వేంద్ర‌రావు క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న చిత్రం.. ఓం వేంక‌టేశాయ న‌మః. అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఇందులో అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌లు. అనుష్క పాత్ర స‌న్యాసినిని పోలి ఉంటుంద‌ట‌. ఆ పాత్ర నుంచి ఏమాత్రం గ్లామ‌ర్ ఆశించ‌రాద‌ట‌.

అయితే అనుష్క రోల్‌లో పెర్‌ఫార్మ్సెన్స్‌కు స్కోప్ ఉంద‌ట‌. అందుకే ఈ సినిమాపై స్వీటీ సంత‌కాలు పెట్టేసింద‌ని టాక్‌. పైగా రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడాయె. నాగ్‌కి అనుష్క హిట్‌పెయిర్ అన్న పేరుంది. పైగా అనుష్క అన్న‌పూర్ణ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన క‌థానాయిక‌. నాగార్జున కోసం ఏమైనా చేస్తుంది. అందుకే ఇంత ఛాలెంజింగ్ పాత్ర‌ని అనుష్క స్వీక‌రించ‌డానికి ముందుకొచ్చింద‌ని టాక్‌. అనుష్క కెరీర్‌కి ఈ సినిమా ఏమంత హెల్ప్ చేస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close