ప్రచురణార్ధం గాంధీజీ మార్గమే శిరోధార్యం – జస్టిస్ జాస్తి చలమేశ్వర్

Mahathmodayam Book Release in London
Mahathmodayam Book Release in London

గాంధీ తత్వం విలువ, గాంధీజీ ప్రాసంగికత ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయనీ, ముందు ముందు, ఇంకా పెరుగుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. గాంధీజిని ప్రపంచ వ్యాప్తంగా మహాత్ముడిగా భావించే కార్యక్రమంలో సత్యాగ్రహమనే ఆయుధంతో ఆయన యుద్ధాలతో, దాడులతో, ఆక్రమణలతో నిండిన ప్రపంచంలో విప్లవాత్మకమైన పెనుమార్పుకు దోహదం చెసారని, దాని వెనుక దీక్ష, పట్టుదల, అంకుఠితమైన శ్రమ, అంతులేని త్యాగం ఉన్నాయాని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే గాంధీజీ సిద్ధాంతాలే శిరోధార్యాలని, ఇంతకుమించిన మరో మార్గం లేదని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. గాంధీజీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా సర్వమానవళి స్వేచ్చగా, నిర్భీతిగా చరించాలనే తపించారని ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి పూర్వ వేదికగా ఆయన ధక్షిణాఫ్రికా ప్రజల హక్కులకోసం చేసిన పోరాటాన్ని, డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాఠకుల హృదయాలకు హత్తుకునేలా రచించారని ఆయన అభినందించారు.

హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు లార్డ్ మేఘనాద్ దేశాయ్ మాట్లడుతూ ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల పెరుగుతున్న ఆదరణను వివరించారు.
Yarlagadda-at-book-release
రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మట్లాడుతూ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వచ్చిన గాంధీజిని ‘అర్ధ నగ్న ఫకీర్ ‘ అవహేళన చేసిన తెల్లవారి రాజధాని లండన్ నగర నడిబొడ్డున ఈరోజు గాంధీజి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని వాళ్ళే పూజిస్తున్నారంటే గాంధీ, గాంధీ సిద్దాంతాల విలువలేమిటో తెలుస్తుందన్నారు. అంధుకే భారతదేశంలోని యువతకు, భవిష్య తరాలవారికి గాంధీజి సిద్దాంతాల విలువను, ఆయన త్యాగాన్ని అందించటానికి ఈ గ్రంధాల రచన చేసానని పేర్కొన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి రాజధాని లండన్ నగరంలో ఈ గ్రంధాల ఆవిష్కరణకు కూడా అదే కారణమన్నారు. భారతదేశం ఒక బారిస్టరును దక్షిణాఫ్రికా పంపితే, దక్షిణాఫ్రికా 21 సంవత్సరాల తర్వాత ఒక మహాత్ముణ్ణి భారతదేశానికి అందించిందని ఆయన పేర్కొన్నారు. తన దక్షిణ ఆఫ్రికా పర్యటనలో తనకు సహకరించినన గాంధీ కింగ్ ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లినపల్లి ప్రసాద్, గాంధీజి మనుమరాలు దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఇలాగాంధీ, గాంధీజి మునిమనుమడు కిడార్ రాం గోభిన్ అందించిన సహాయాన్ని ఆయన వివరించారు. గ్రంధాలను ప్రచురించిన ఎమెస్కో అధినేత దూపాటి విజయ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు.

“దక్షిణాఫ్రికాలో మహోత్మోదయం” పేరుతో డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన హిందీ, తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, భారత దౌత్య కార్యాలయం, సంస్కృతి సంస్థల సంయుక్త ఆద్వర్యంలో లండన్ లోని నెహ్రూ సెంటర్ లో ఈ రోజు జరిగింది.

సభను సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి వింజమూరి రాగసుధ నిర్వహించారు.
Mahamotdyamam-book-release
లండన్ లో భారత దౌత్య అధికారి శ్రీనివాస్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, యునైటెడ్ కింగ్ డం తెలుగు సంఘం, సి.పి.బ్రౌన్ అక్కడమి ప్రతినిధులతో పాటు లండన్ లో నివసిస్తున్న ఉత్తర భారత ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.

జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించిన తెలుగు గ్రంధం తొలి ప్రతిని డా.గోవర్ధన్ రెడ్డి, లార్డ్ మేఘనాధ్ దేశాయ్ ఆవిష్కరించిన హిందీ గ్రంధం ప్రతిని శ్రీమతి జాస్తి లక్ష్మీ నళిని స్వీకరించారు.
సభలో తురుమెళ్ళ మాధవ్, డా.దాసోజు రాములు, గుంటుపల్లి జయకుమార్, డా.వ్యాకరణం రామారావు, ఉదయ్ ఆర్యన్, అనిత ప్రభృతులు పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com