జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ డేట్ ఫిక్స్

టెంప‌ర్ , నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు అంద‌రి దృష్టీ జ‌న‌తా గ్యారేజ్‌పైనే ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హ్యాట్రిక్‌కొడితే చూడాల‌ని ఆయ‌న అభిమానులు ఆశ ప‌డుతున్నారు. దానికి తోడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కీ ఇది హ్యాట్రిక్ సినిమానే. మిర్చి, శ్రీ‌మంతుడు.. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్‌. ఈ సినిమా హిట్ట‌యితే కొర‌టాల రేంజ్ అమాంతం పెర‌గ‌డం ఖాయం. సో.. ఆయ‌నా ఈ సినిమాని స‌క్సెస్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఈ సినిమాకి పాజిటీవ్ బ‌జ్ రావ‌డంతో… అన్ని ఏరియాలూ ఫ్యాన్సీ రేట్ల‌కు అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు?? ఎలాంటి డైలాగులు చెబుతాడు? ఇంత‌కీ ఈ సినిమా ఫ్లేవ‌ర్ ఏంటి? అనే ఆస‌క్తి నెల‌కొంది. దానికి జ‌న‌తా గ్యారేజ్ టీమ్ కూడా కాస్త క్లూ ఇవ్వ‌బోతోంది.. టీజ‌ర్‌ద్వారా.

ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఫ‌స్ట్ లుక్‌తో స‌రిపెట్టింది జ‌న‌తా గ్యారేజ్ టీమ్‌. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యింది. జులై 6న జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ విడుద‌ల చేస్తార‌ట‌. ఈ విష‌యాన్ని జ‌న‌తా గ్యారేజ్ చిత్ర‌బృందం అఫీషియ‌ల్‌గా ధృవీక‌రించింది. ఆడియో ఫంక్ష‌న్ ఖ‌మ్మంలో చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై ఓ క్లారిటీ రావాల్సివుంది. టీజ‌ర్‌కి మాత్రం ముహూర్తం రెడీ అయిపోయింది. ఫ్యాన్స్‌.. సిద్ధ‌మైపోండిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close