ఆదీ…. ఇదేందీ??

ఈత‌రం కుర్ర హీరోలంతా కాన్సెప్ట్ క‌థ‌ల‌వైపు ప‌రుగులు పెడుతున్నారు. నాని, సందీప్ కిష‌న్‌, నిఖిల్ వీళ్లంతా వెరైటీ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలో పోటీ ప‌డుతున్నారు. ఆ ఉత్సాహాన్ని ప్రేక్ష‌కులూ బాగానే ప్రోత్స‌హిస్తున్నారు. కొంత‌మంది మాత్రం మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ బాట విడ‌చి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అలాంటి హీరోల్లో ఆది ఒక‌డు. ప్రేమ కావాలి అంటూ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆది. డాన్సులు, ఫైట్ల‌లో ఆది ఈజ్ చూసి అంతా ముచ్చ‌ట‌ప‌డ్డారు. అందుకేనేమో ల‌వ్ స్టోరీలు చేయాల్సిన ఏజ్‌లో యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకోవాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతున్నాడు. అందుకే ఈమ‌ధ్య ఆదికి గ‌ట్టి ఫ్లాపులు త‌గిలాయి. ఇప్పుడు చుట్టాల‌బ్బాయ్ అంటూ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకొంటున్నాడు.

వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం టీజ‌ర్ ఈరోజే విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తుంటే ఆది ఏం మార‌డ‌లేద‌ని అనిపిస్తోంది. ఈసారీ మాస్‌, యాక్ష‌న్ ఫార్ములానే న‌మ్ముకొన్న‌ట్టుంది. టీజ‌ర్లో రెండు డైలాగున్నాయ్‌.. అవీ చ‌ప్ప‌గానే సాగాయి. యాక్ష‌న్ ఎపిసోడ్‌లో… రౌడీలు బంతుల్లా గింగిరాలు తిరుగుతున్నారు. వ‌య‌సుకి మించిన బాధ్య‌త నెత్తిమీద వేసుకొన్న‌ట్టే అనిపిస్తోంది. మ‌రి చుట్టాల‌బ్బాయ్ తో ఆది షాకిస్తాడో… లేదంటే ఆదికే ఆడియ‌న్స్ షాకిస్తారో తేలాలంటే చుట్టాల‌బ్బాయ్ బ‌య‌ట‌కు రావాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close