ఇంకా ఎంత మంది మెగా హీరోలు వస్తారో…?

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసింది. ఎప్పుడో ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 150వ సినిమాని సైతం శ్రీజ వివాహం కోసం వాయిదా వేశాడు . గతంలో శిరీష్ భరద్వాజ్ తో ప్రేమ వివాహం చేసుకొని విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత శ్రీజకు చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ తో ఈ ఏడాది ఆరంభంలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కూడా ధనిక వర్గానికి చెందిన వాడని, హీరో ల‌క్ష‌ణాలు వున్న కళ్యాణ్, సినిమా హీరో అవ్వాలనే మెగా ఫ్యామిలీ తో సంబంధం కలుపుకున్నారని పెళ్లి లో చెవులు కోరుక్కున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు మెగా ఫ్యామిలీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే చిరంజీవి కొడుకులు, మేనల్లుల్లు, అంతా హీరోలుగా వెండితెరపై దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో సినిమా  రంగంపై ఉన్న ఆసక్తితో కళ్యాణ్ కూడా హీరో అవ్వాలని అనుకుంటున్నాడట. కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తే ఎలాగు మెగా ఫ్యామిలీ అండదండలు ఉంటాయి, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మొదట శ్రీజతో ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తాడట కళ్యాణ్. సో చిరు అల్లుడు క‌ళ్యాణ్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి, టాలీవుడ్ తెర‌పై మరో ‘కళ్యాణ్’ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close