కేంద్ర నిధులు.. పక్కదారి, అటుపై పచ్చజేబుల దారి!

కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం సర్కారు ఉంది.. రెండూ మిత్రపక్షాలే కావడంతో ఈ రెండింటి కాంబినేషన్ ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తుందని చాలా మంది ఆశించారు. ఈ విషయాన్నే గట్టిగా చెప్పారు బీజేపీ, తెలుగుదేశం నేతలు. రాష్ట్రంలో, కేంద్రంలో తమ కాంబినేషన్ ను ఎన్నుకుంటే ఏపీకి తిరుగే ఉండదని వీరు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల ఆశలు కూడా అవే అయినా.. అసలు వ్యవహారం మాత్రం మరో రకంగా ఉంది. ఇప్పటి వరకూ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల పై కేంద్రం వ్యవహఱించిన తీరు సరిగా లేదు. అలాగే ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని స్పష్టం అవుతోంది.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న ఆర్థిక లోటు పూడ్చడం వంటి అంశాల పై ఇప్పటికే చాలా రచ్చ జరిగింది తప్ప ఏపీకి ఒరిగింది ఏమీ లేదు. కొంతలో కొంత బెటర్ ఏమిటంటే.. ఏపీ లో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు కేటాయించడం. విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, సీమలోని మొత్తం ఏడు జిల్లాలకు ఏడువందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పుడు ఆ నిధుల విషయంలో నీతి ఆయోగ్ స్పందించింది. వీటిని చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆ కేంద్ర సంస్థ వ్యాఖ్యానించింది. ఇది సరికాదని స్పష్టం చేసింది. దీనిపై తనిఖీలు చేపడతామని కూడా నీతి అయోగ్ వ్యాఖ్యానించింది.

మరి ఈ నిధుల పక్కదారి పట్టిన విధానం గురించి పరిశీలిస్తే.. రాయలసీమ జిల్లాల్లో ఈ నిధులను చెట్లు నాటడానికి వాడేశారు! నీరు చెట్టు అంటూ ఈ నిధులను వాడారు. ఈ కార్యక్రమం మంచిదే అయినా విమర్శలు తప్పలేదు. చెట్లు నాటడానికి నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణ. చెట్ల సంఖ్య విషయంలో తప్పుడు లెక్కలు చూపడం, వంద చెట్లు నాటి వెయ్యి నాటమని చెప్పడం, వాటి సంరక్షణకు అంటూ తెలుగుదేశం కార్యకర్తలకు నిధులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా వెనుకబడిన రాష్ట్రాల్లో అభివృద్ధికి అంటూ కేటాయించిన నిధులను అటు తిప్పి ఇటు తిప్పి తెలుగుదేశం అనుకూలుర జేబుల్లోకి చేర్చిన విధానం ఇది. మరి ఇప్పుడు నీతి అయోగ్ గట్టిగానే స్పందిస్తోంది. ఈ విషయం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close