జైలుకెళ్లిన గోరంట్ల మాధవ్‌ను పరామర్శించాలనే ఆలోచన జగన్ చేయలేదు. కానీ తన ప్రతినిధిగా పార్టీ నేతల్ని కూడా పంపలేదు. అయితే తను చెప్పిన అడ్డగోలు పనులన్నీ చేసి జైలు పాలైనా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వద్దకు తన ప్రతినిధిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను జగన్ పంపించారు. పార్టీ నేతలు వెళ్తే.. ఐపీఎస్ ఆఫీసర్.. ఇంకా వైసీపీ గ్రిప్ల్ లో ఉన్నారని ప్రజలు అనుకుంటారని.. స్వయం ప్రకటిత మేధావిగా..తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకునే శ్రేయోభిలాషిని జగన్ ఎంచుకున్నారు.
విజయవాడ జైలులో ఉండవల్లి అరుణ్ కుమార్.. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ములాఖత్‌లో కలిశారు. మామూలుగా అయితే ఉండవల్లికి .. పీఎస్ఆర్కు ఎలాంటి సంబందం లేదు. ములాఖత్‌లో కావాల్సిన అవసరం లేదు. కానీ అడ్డగోలుగా వాడుకుని వదిలేశారని జైలుకెళ్లే కనీసం సంఘిభావం ఎవర్నీ పంపలేదని అంటారని ఉండవల్లిని పంపించారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పీఎస్ఆర్ తనకేమీ తెలియదని.. జత్వానీ కేసులో అంతా కాంతిరాణా, విశాల్ గున్నీనే చేశారని అంటున్నారు.
అయితే అంతా పీఎస్ఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అందరికీ తెలుసు. తమను బలి పశువుల్ని చేయాలనుకుంటే ఆ ఐపీఎస్ అధికారులు ఇద్దరూ తాము చెప్పాలనుకున్నది చెబుతారు . దీంతో ఈ కేసు.. మెల్లగా అప్పటి సీఎంవోకు చేరుతుంది. సీఎం ఆదేశాలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఇదంతా జరిగిందన్న విషయం బయటపడుతుంది. అందుకే విషయం అక్కడి వరకూ రాకుండా ఉండవల్లితో కథ నడిపించేందుకు వైసీపీ పెద్దలు స్కెచ్ వేశారని అనుకోవచ్చు.