స్మితా సభర్వాల్ లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అనుకోవడం తప్పని తెలంగాణ సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్ కు ఆయన ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా స్మితా సభర్వాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్మితా సబర్వాల్ ఎందుకు బదిలీ అయ్యారో అందరికి తెలిసిందేనన్నారు. ఆమె లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అనుకోవడం తప్పని స్పష్టం చేశారు. తనకూ చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. అనేక దేశాల్లో తిరిగి చాలా పెద్ద ఈవెంట్లు చేశానని.. స్మితా లేకపోతే ఏదో అవుతుందన్న అపోహ వద్దని స్పష్టం చేసింది. ఆమె బాగా పని చేసింది కానీ ఆమె లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగిపోదన్నారు.
మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న సమయంలో టూరిజం శాఖ ఉన్నతాధికారిణిగా ఉన్న స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. ఆ ఈవెంట్ మొత్తం ఆమె తన సొంత ఆసక్తి కూడా తోడవడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆమెకు ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యం ఇస్తున్నా.. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో ఫేక్ పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. ఆమెను ఇక ప్రాధాన్య పోస్టుల్లో ఉంచకూడదన్న ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభానికి ముందే బదిలీ చేశారు.
ఆ తర్వాత కూడా స్మితా సభర్వాల్ ధిక్కార పోస్టులుపెట్టారు. ఈ క్రమంలో అధికారవర్గాల్లో ఆమెపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఆమె అత్యధిక ప్రాధాన్యం పొందారు. జూనియర్ ఆఫీసర్ అయినా సీఎంవోలో ఉండటంతో ఉన్నతాధికారులపైనా ఆమె పెత్తనం చేసేవారని అంటారు. ఈ ప్రభుత్వంలో అలాంటి ప్రాధాన్యం దక్కకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. దాన్ని బహిరంగంగా చూపించడంతో అప్రాధాన్య పోస్టుకు వెళ్లిపోయారు.