అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి వంద రోజులు అయింది. ఈ వంద రోజుల్లో ఆయన చేసిందేమీ లేదు. ఎన్నో చేయాలనుకున్నారు కానీ ఏమీ చేయలేదు. ఆయన వల్ల ఏమీ కాలేదు కానీ అమెరికన్లకు మాత్రం నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ట్రంప్ తన మొదటి 100 రోజుల్లో 142 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు. ఇన్ని ఆర్డర్స్ తొలి రోజుల్లోనే ఇచ్చిన అధ్యక్షుడు మరొకరు లేరు. అయితే ఈ ఆర్డర్స్ లో ఎన్ని అమలు అవుతున్నాయంటే.. ప్చ్ అనే సమాధానం వస్తుంది.
పౌరసత్వం దగ్గర నుంచి టారిఫ్స్ వరకూ ఆయన ఎన్నో ఆదేశాలు ఇచ్చారు..కొన్ని హోల్డ్ లో పెట్టారు. కొన్ని వాయిదా వేశారు. కొన్నింటిని కోర్టులు కొట్టి వేశాయి. కొన్ని అమలవుతున్నాయి.. అవి అమెరికన్ ప్రజలకు నష్టం చేసేవి. అమెరికా ప్రభుత్వ సిబ్బందిని భారీగా తగ్గించారు. మొత్తంగా ట్రంప్ ఐదు బిల్లులపై మాత్రమే సంతకాలు చేయగలిగారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ల పేరుతో ఆయన చేసిన హడావుడితో అమెరికన్లకు ఖర్చు పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికన్లు 1901 తర్వాత అత్యధికంగా 28 శాతం టారిఫ్ రేటు కడుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానని హామీ ఇచ్చిన ఆయన భారీగా పెరగడానికి కారణం అయ్యారు. ట్రంప్ పాలనా నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్ అస్థిరతకు గురైంది. ఎనిమిది శాతానికిపైగా పడిపోయింది, ఇది 1974 తర్వాత అత్యంత దారుణమైన పనితీరు.
ప్రపంచవ్యాప్తంగా సమస్యలపై ఆయన స్పందించే తీరు చాలా కుత్సిత మనస్థత్వంతో ఉంటుందన్నది విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రకారం ఆయన ప్రజల మద్దతు కోల్పోరు. ఇప్పుడు ఆయన అప్రూవల్ లేటింగ్స్ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అయితే తనను నమ్మాలని ఆయన ప్రజల్ని కోరుతున్నారు. కానీ పౌరసత్వాలను కూడా అమ్ముకుంటున్న ఆయనను ఎలా నమ్మాలని ప్రజలు మథనపడుతున్నారు. అయితే ప్రతీ దేశంలో ఉన్నా.. ప్రతీ చోటా ఉన్నట్లే.. అలాంటి విపరీత మనస్థత్వం కొంత మంది అమెరికన్లకు నచ్చుతోంది. షాకులు తగిలేదాకా వారిలో మార్పు రాకపోవచ్చు. కానీ మెజార్టీ మాత్రం ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నారు.