భారత్ ను ఎదుర్కోవడం సంగతేమో కానీ పాకిస్తాన్ కు అతి పెద్ద ముఫ్పు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వస్తోంది. తమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ సైన్యం వెళ్లిపోవాలని ఆ గ్రూప్ దాడులకు తెగబడుతోంది. ఇటీవలి కాలంలో వరుసగా దాడులు చేస్తోంది. శనివారం ఒక్క రోజే ఇరవై రెండు మంది సైనికుల్ని హతం చేసినట్లుగా ప్రకటించింది. ఆ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది.ఆయా ప్రాంతాల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేశారు.
ఇటీవల బలూచిస్తాన్ లో ఓ పెద్ద రైలును హైజాక్ చేసి పేల్చివేశారు. అంతకు ముందు కొన్ని దాడులు చేశారు. బలూచిస్తాన్ లో ఎవరూ అడుగు పెట్టకుండా చూస్తున్నారు. వారికి పాకిస్తాన్ సైన్యం సరైన కౌంటర్ ఇవ్వలేకపోతోంది. సైనికుల్ని కోల్పోతోంది. ఇప్పుడు బలూచిస్తాన్ లోకి అడుగు పెట్టాలంటే పాక్ సైన్యం అంగీకరించడం లేదు. మరో వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేరుగా హెచ్చరికలు పంపుతోంది.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోందని అంటోంది. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాదం ఇప్పటిది కాదు. అక్కడి వనరులన్నీ వాడుకుని అక్కడ వివక్ష చూపించడం ప్రారంభించినప్పటి నుంచి ఉంది. భారత్ వైపు నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు కానీ.. అక్కడి ప్రాంత ప్రజలు ఎప్పుడూ భారత్ సాయం కోరుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి మరింత బలం లభిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. పరిస్థితి విషమించిదే.. బంగ్లాకు అప్పట్లో విముక్తి కల్పించినట్లుగా..ఇప్పుడు బలూచిస్తాన్ కూ విముక్తి కల్పించేందుకు భారత్ సహకరిస్తుందేమో ?