ఏపీ రాజధాని అమరాతిలోని నవనగరాల్లో ఒకటి అయిన ఎంటర్టెయిన్మెంట్ సిటీలో క్రియేటివ్ ల్యాండ్ పెట్టుబడులు పెట్టనుంది. థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్లు ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్‌ల్యాండ్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు. ఏఐ, ఆర్ అండ్ డీ, వీఎ్‌ఫఎక్స్, గేమింగ్, వినోదం, టెక్, పర్యాటక రంగాల్లో విద్యా ఉపాధి అవకాశాలను క్రియేటివ్ ల్యాండ్ మెరుగుపరుస్తుంది.
క్రియేటర్ ల్యాండ్ ఏర్పాటు తర్వాత ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ హబ్ ద్వారా వినోదంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది. పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఎంవోయూ ప్రకారం క్రియేటివ్‌ల్యాండ్ ఐదారేళ్లలో రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా. పాతిక వేల ఉద్యోగాల కల్పన టార్గెట్ గా .. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఈ వరల్డ్ క్లాస్ క్రియేటివ్ టౌన్ షిప్ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్విట్టర్ లో తెలిపారు.
అమరావని నవనగరాలు ప్రైవేటు పెట్టుబడుల మీదనే అభివృద్ది చెందాల్సి ఉంది. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులు సాధించేందుకు విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో మంచి మంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటిలో వేగంగా ఏ కంపెనీలు వస్తాయన్న దానిపై అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.