బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆర్టీసీ కార్మికులు డిసప్పాయింట్ కు గురి చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టాలనుకున్న సమ్మె న్యాయబద్ధమైనదని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రెస్ మీట్ లో కోరిన కొద్ది క్షణాల్లోనే సమ్మె వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో కేటీఆర్ ఫీల్ అయి ఉంటారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయమే అవుతోంది..అప్పుడే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం సరైంది కాదని, హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూద్దామని కొంతమంది సూచించారు. మరికొంతమంది మాత్రం సమ్మె చేసి తీరుతామని ప్రకటించారు. కేటీఆర్ కూడా వారిని రెచ్చగొట్టేలా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయిస్తే విలన్లుగా చిత్రీకరిస్తారా? అంటూ రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశం అయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తప్పకుండా కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి చేపట్టాలనుకున్న సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడితే చూడాలని ముచ్చట పడిన కేటీఆర్ ను , కార్మికులు డిసప్పాయింట్ కు గురి చేశారని అంటున్నారు.