కష్టాల్లో ఉన్నాం అంతర్జాతీయ ఆర్థిక భాగస్వాములు విరాళాలు ఇవ్వాలి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పోస్టు చేసుకుంది. మింగ మెతుకు లేదు కానీ మీకెందుకురా ఉగ్రవాదం, యుద్ధం అని అందరూ ఖాండ్రించేందుకు సిద్ధమయ్యే సరికి డిలీట్ చేసుకుంది. ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని కవర్ చేసుకుంది. కానీ అలా బహిరంగంగా అడుక్కోవడం వల్ల పరువు పోతుందని.. చీకట్లో కాళ్లు పట్టుకునే పద్దతి బెదరని డిసైడ్ కావడంతోనే డిలీట్ చేశారు. పాకిస్తాన్ వద్ద ఇప్పుడు పైసా లేదు.
భారత్ చేసిన రెండు రోజుల దాడులకే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం అయిపోయింది. వందల కోట్ల సంపదను నాశనం అయిపోయింది. భారత్ పైకి పంపిన ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఒక్కటి కూడా వెనక్కి పోలేదు. మరోవైపు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ కు రోజువారీ వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ఇప్పుడు అప్పుల కోసం ఆర్థిక సంస్థల వద్దకు పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఇస్తే యుద్ధానికి వాడుతారని ఎవరూ అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
మరో రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది. ఆ దేశంలో ఇప్పటికే ఆర్థిక పరమైన ఎమర్జెన్సీ కనిపిస్తోంది. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్ డ్రాకు లిమిట్ పెట్టారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. భారత ఆర్థిక యుద్ధాన్ని కాచుకోవడం పాక్ కు సాధ్యం కావడం లేదు.