భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం భారత్ – పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ రీస్టార్ట్ పై చర్చ ప్రారంభమైంది.
సీజ్ ఫైర్ కు రెండు దేశాలు అంగీకరించడంతో ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. ఆదివారం లేదా సోమవారం షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. దీంతో వచ్చేవారం నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు యథావిధిగా కొనసాగుతాయని, దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనుందని తెలుస్తోంది.
అయితే, ఐపీఎల్ వేదికలో మార్పు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. పూర్తిగా దక్షిణ భారతదేశంలోనే మ్యాచ్ లను కొనసాగించాలనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ , చెన్నై , బెంగళూరు, విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కాల్పుల విరమణకు పాక్ అంగీకరించినా..ఆటగాళ్ళ భద్రత దృష్ట్యా సౌత్ ఇండియాలో మ్యాచ్ లు జరపడం శ్రేయస్కరమని భారత్ భావిస్తోంది. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వనుంది.