హైదరాబాద్ లో సొంత ఇల్లు అనేది చాలా మంది కల. దీన్ని నెరవేర్చుకోవాలంటే మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడాలి. నాన్ ఐటీ ఉద్యోగులకు ఇళ్లు అనేది తీర్చుకోలేనికలగా మారుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ డబుల్ బెడ్ రూం కొనుగోలు చేయాలంటే కనీసం అరవై లక్షలు పెట్టాలి. సగటు ధర అంత ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే యాభై లక్షలకు కూడా ఆపార్టుమెంట్లు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి.
హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ ను దాటిన తర్వతా పలు ప్రాంతాల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ 2 BHK అపార్ట్మెంట్లు సుమారు 1000-1200 చదరపు అడుగుల విస్తీర్ణంతో 40-50 లక్షల రేంజ్లో లభిస్తున్నాయి. చిన్న బిల్డర్లు వీటిని నిర్మిస్తున్నారు. అలాగే నార్త్ హైదరాబాద్లో కొంపల్లి లో కూడా 2 BHK అపార్ట్మెంట్లు 45-50 లక్షల రేంజ్లో లభిస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
చందానగర్-అమీన్పూర్ రూట్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ బాగా పెరిగింది. 2 BHK అపార్ట్మెంట్లు 45-50 లక్షల రేంజ్లో లభిస్తున్నాయి. ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో నూ కొన్ని చోట్ల ఈ రేట్లకు అపార్టుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ కు కాస్త దూరంగా అయినాపర్వాలేదని అనుకుంటే షాద్నగర్ 2 BHK అపార్ట్మెంట్లు 35-50 లక్షల రేంజ్లో అమ్ముతున్నారు.
అయితే బడా బిల్డర్లు మాత్రం యాభై లక్షల రేంజ్ లో అమ్ముతున్నా… ఇతర చార్జీలను మరో పది లక్షల వరకూ ఎక్కువగా వేస్తూంటారు. చిన్న బిల్డర్లు అయితే.. ఎమ్మార్పీ అనుకోవచ్చు. ఇల్లు కావాల్సిన వాళ్లు అందుబాటులో ఉన్న ఏరియాలో ఒక టి, రెండు రోజులు సమయం తీసుకుని సెర్చ్ చేస్తే.. కలను నెరవేర్చుకోవచ్చు.