తాడేపల్లికి సంబంధించి వైసీపీ సమావేశాలు జరిగినా.. లేకపోతే జగన్ రెడ్డి బెంగళూరుకు వచ్చి, వెళ్లే దృశ్యాలు మీడియా ప్రసారం చేసినా ప్రజలకు ముందుగా అనిపించేది ఒక్కటే. ఎదురుగా కనిపించేదంతా ప్రజాధనమే… ప్రభుత్వానికి ఎప్పుడు తిరిగి ఇస్తారు అనే.
జగన్ రెడ్డి ఇంటి దృశ్యాలు కనిపిస్తే ఎదురుగా కనిపించేది .. సెంట్రల్ జైలు మాదిరిగా అత్యంత పటిష్టంగా చుట్టూకట్టిన ఇనుప కట్టడం. జగన్ కు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ చెప్పిందని చెప్పి కోట్లు ప్రజాధనం పెట్టి ఆ మెష్ కట్టించుకున్నారు. అది ప్రైవేటు నివాసం అని.. అలా చేస్తే తర్వాత సమస్యలు వస్తాయని తెలిసి కూడా పట్టించుకోలేదు.
ఇక జగన్ సమావేశాలు నిర్వహించే హాల్.. ప్రజాధనంతో తీర్చిదిద్దుకున్నది. తన నివాసానికి క్యాంపు ఆఫీస్ అనే పేరు పెట్టించేసుకుని కిటికీల దగ్గర నుంచి కుర్చీల వరకూ అన్నీ ప్రజాధనంతో కొనేశారు. కనీసం ఆ ఇంటికి ముఫ్పై నుంచి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. అంత పెద్ద మొత్తంలో తన ఇంటికి ముస్తాబు చేయించుకున్న జగన్ ఇప్పటి వరకూ ప్రభుత్వానికి పైసా కూడా ఇవ్వలేదు. ఇవ్వాలన్న ఉద్దేశంలో లేరు. సంబంధం లేని వాళ్లతో.. ఫర్నీచర్ ఇచ్చేస్తామని లేఖ రాయిస్తారు. తర్వాత తీసుకోవడం లేదని కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు అది కోర్టులో ఉందని నిరాటంకంగా వాడేసుకుంటున్నారు.
జగన్ రెడ్డికి డబ్బులకు కొదవేం లేదు. ఆయనకు అధికారికంగా… వందల కోట్లు.. అనధికారికంగా వేల కోట్లు ఉంటాయి. అయినా కక్కుర్తితో ప్రజాధనాన్ని తన ఇంటికి వాడుకున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఓడిపోయినా.. వాడేసుకుంటున్నారు. ఇవ్వాలని అనుకోవడం లేదు. అందుకే ఆయన ఇంటి దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికి ఇదంతా ప్రజాధనమే కదా అన్న భావన వస్తూంటుంది.